ఓటీటీ, నిర్మాతలకు మధ్య నలిగిపోతున్న ఎగ్జిబిటర్స్‌!

11 Jul, 2021 17:50 IST|Sakshi

ఓ పక్క కరోనా, మరో పక్క ఓటీటీ ఎగ్జిబిటర్స్‌ను నిద్రపోనివ్వకుండా చేస్తున్నాయి. దీంతోపాటు నిర్మాతలు కూడా ఓటీటీ వైపు మొగ్గు చూపుతుండటంతో థియేటర్‌ యజమానులు తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో థియేటర్స్‌ ఎప్పుడు తెరుచుకుంటాయి? జనాలు తిరిగి థియేటర్లలో బొమ్మ చూసేదెప్పుడు? అన్నది ఆసక్తికరంగా మారింది.

అయితే ఏదేమైనా జూలై నెలాఖరు వరకు థియేటర్లు ఓపెన్‌ చేస్తామని తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వీఎల్‌ శ్రీధర్‌, తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ జాయింట్‌ సెక్రటరీ బాలగోవిందరాజు స్పష్టం చేశారు. ఆగస్టు 15కు రెండు పెద్ద సినిమాలు థియేటర్లలో విడుదల కాబోతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికిప్పుడు థియేటర్లు తెరిచినా ఓ 15 సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయని తెలిపారు. ఓటీటీ కేవలం కంటెంట్‌ను అందించేది మాత్రమేనని, థియేటర్లు దాన్ని ప్రదర్శించేదని చెప్పుకొచ్చారు.

మరిన్ని వార్తలు