Adipurush Teaser: హనుమంతుడి పాత్రపై హోంమంత్రి అభ్యంతరం, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం!

4 Oct, 2022 14:04 IST|Sakshi

ఆదిపురుష్‌ టీజర్‌ను వరుసగా వివాదాలు చూట్టుముడుతున్నాయి. ఇప్పటికే ఈ టీజర్‌పై బీజేపీ అధికార ప్రతినిథి, నటి మాళవిక అవినాష్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ దర్శకుడు ఓం రౌత్‌పై మండిపడ్డ సంగతి తెలిసిందే. రామాయణం గురించి రావణుడి పాత్ర గురించి ఎలాంటి అధ్యయనం చేయకుండానే ఓం రౌత్‌ ఆదిపురుష్‌ చిత్రాన్ని తెరకెక్కించినట్టు ఉన్నారని ఆమె ఎద్దేవా చేశారు. అంతేకాదు టీజర్‌ రిలీజైనప్పటి నుంచి నెటిజన్లు విమర్శలు చేస్తూనే ఉన్నారు. టీజర్‌ నిరాశ పరించింది, ఇది సినిమానా, పిల్లలు చూసే యానిమేటెడ్‌ కార్టున్‌ చిత్రమా? అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

చదవండి: ‘ఓం రౌత్‌కు రామాయణం తెలియదా?’ బీజేపీ మహిళా నేత విమర్శలు

ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా తాజాగా టీజర్‌పై స్పందిస్తూ మరో కొత్త వాదనను తెరపైకి తీసుకువ్చారు. బీజేపీ నాయకురాలు మాళవిక రావణుడి పాత్రపై అభ్యంతరం చెప్పగా.. ఆయన హనుమంతుడి పాత్రపై స్పందించారు. తాజాగా మీడియా ముందుకు వచ్చిన ఆయన టీజర్లో హనుమంతుడికి సంబంధించిన సన్నివేశాలపై అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘ఆది పురుష్ సినిమా టీజర్ చూశాను. అయితే అందులో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయి. హిందువుల విశ్వాసానికి సంబంధించిన కొన్ని విషయాలను చూపించే విధానం అందులో సరిగా లేదు.

చదవండి: హీరోతో లిప్‌లాక్‌ సీన్‌.. రాత్రిళ్లు ఉలిక్కి పడి లేచేదాన్ని: రష్మిక

టీజర్లో హనుమంతుడు ధరించిన అంగవస్త్రం తోలుతో(లెదర్ తో) తయారు చేసినట్టు చూపించారు. అది హిందు మత విశ్వాసలను దెబ్బతీసేలా ఉంది. హనుమాన్ చాలీసాలో హనుమంతుడు ఎలా ఉంటారనేది స్పష్టంగా వివరించబడింది. కానీ దర్శకుడు ఇంకేదో చేసి చూపించారు’ అని మండిపడ్డారు. ఇలాంటి అభ్యంతకర సన్నివేశాలను దర్శకుడు సినిమా నుంచి తొలగించాలని ఆయన డిమాండ్‌ చేశారు. అంతేకాదు ఈ విషయమై దర్శకుడు ఓం రౌత్‌కు లేఖ రాస్తానన్నారు. ఇక తమ డిమాండ్‌ మేరకు ఓం రౌత్‌ ఆ సన్నివేశాలను తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చిరించారు. 

మరిన్ని వార్తలు