ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 

13 Feb, 2023 02:23 IST|Sakshi

దివంగత నటి, దర్శక–నిర్మాత విజయనిర్మల  మనవడు శరణ్‌ కుమార్‌ (నటుడు నరేశ్‌ కజిన్  రాజ్‌కుమార్‌ తనయుడు) హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘మిస్టర్‌ కింగ్‌’. శశిధర్‌ చావలి  దర్శకత్వం వహించారు. యశ్విక నిష్కల, ఊర్వీ సింగ్‌ కథానాయికలు. హన్విక క్రియేషన్‌ బ్యానర్‌పై బీఎన్  రావు నిర్మించిన ఈ మూవీ ఈ నెల 24న విడుదలకానుంది. శరణ్‌ కుమార్‌ మాట్లాడుతూ– ‘‘మిస్టర్‌ కింగ్‌’ నా మొదటి సినిమా. ప్రేక్షకుల ప్రేమ, సపోర్ట్‌ కావాలి.  మా సినిమాని చూసి ఆశీర్వదించాలి’’ అన్నారు.

‘‘యూత్‌ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. అమ్మాయి ఉన్న ప్రతి కుటుంబం, ఆత్మగౌరవం ఉన్న ప్రతి అబ్బాయి చూడాల్సిన మూవీ’’ అన్నారు శశిధర్‌ చావలి.  ‘‘మా చిత్రాన్ని అందరూ థియేటర్‌లో చూడాలి’’ అన్నారు బీఎన్‌ రావు. ఈ కార్యక్రమంలో యశ్విక నిష్కల,  ఊర్వీ సింగ్, కెమెరామేన్‌ తన్వీర్, నటుడు రాజ్‌ కుమార్‌ మాట్లాడారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: రవి కిరణ్‌ చావలి, సంగీతం: మణిశర్మ. 

మరిన్ని వార్తలు