ఆ వార్తను పేపర్‌లో చదివే ఈ సినిమా తీశాను: డైరెక్టర్‌

17 Aug, 2023 01:43 IST|Sakshi

సయ్యద్‌ సోహైల్, రూపాకొడవయూర్‌ జంటగా శ్రీనివాస్‌ వింజనంపాటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మిస్టర్‌ ప్రెగ్నెంట్‌’. అప్పిరెడ్డి, వెంకట్‌ అన్నపరెడ్డి, రవీందర్‌ రెడ్డి సజ్జల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది.

ఈ సందర్భంగా శ్రీనివాస్‌ వింజనంపాటి మాట్లాడుతూ– ‘‘నా వ్యక్తిగత జీవితంలోని ఘటనల ఆధారంగా, మేల్‌ ప్రెగ్నెంట్‌ అనే వార్తను పేపర్‌లో చదివి ఈ కథ రాసుకున్నాను. అమ్మాయి కోసం అబ్బాయి, అబ్బాయి కోసం అమ్మాయి చూడాల్సిన చిత్రం ఇది. తెలుగు పరిశ్రమలో ఓ మంచి సినిమా చేశామనే పేరు వస్తుంది’’ అన్నారు.

మరిన్ని వార్తలు