Mridula Mahaja: 'లా' స్టూడెంట్‌ నుంచి వెబ్‌స్టార్‌గా..

7 Nov, 2021 08:43 IST|Sakshi

ఒక్క చాన్స్‌.. ఒకే ఒక్క చాన్స్‌ అని అడిగిన ఆమెకు, ఒకేసారి వెండితెర, వెబ్‌తెర, బుల్లి తెరల్లో తెరంగేట్రం చేసే అవకాశం లభించింది. వెబ్‌స్టార్‌గా ఎదిగింది. ఇంతకీ ఆమె ఎవరో కాదు.. లా చదివిన యాక్టర్‌.. మృదులా మహాజన్‌.. 

  ♦ చండీగఢ్‌లో పుట్టి,పెరిగిన మృదుల.. పంజాబ్‌ యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ చేసింది. 

  ​​​​♦ చిన్నప్పటి నుంచి నటన అంటే ఇష్టం. ఆ ఆసక్తితోనే కాలేజీ రోజుల్లో నాటకాలు వేయడం మొదలుపెట్టింది. థియేటర్‌ ఆర్టిస్ట్‌గా మారింది.  

     సినిమాల్లో నటించాలనే తన కలను నెరవేర్చుకోవడం కోసం చాలా కష్టపడింది. ఎన్నో ఆడిషన్స్‌కు వెళ్లింది. 

     2018లో అవకాశాలన్నీ ఆమె ఇంటి ముందు క్యూ కట్టాయి. ఒకేసారి ఒక సినిమా, ఒక సీరియల్, ఒక ఆల్బమ్‌ సాంగ్‌లో నటించే చాన్స్‌ వచ్చింది.

     ‘పీటీసీ ఏక్‌ కహానీ: ఆజాద్‌’ పంజాబీ సినిమాతో వెండితెరను, ‘అన్‌టోల్డ్‌ లవ్‌’ సీరియల్‌తో బుల్లితెరను, ‘సహన్‌ దీ చార్ఖీ’ ఆల్బమ్‌తో వెబ్‌తెరను ఒకే ఏడాదిలో కవర్‌ చేసింది. 

     ఇన్ని లెరలనూ కవర్‌ చేస్తే.. ఒక్కచోటైనా క్లిక్‌ కాదా? అయింది కాబట్టే.. బాలీవుడ్‌లో మెరిసింది. 

     2019లో విడుదలైన ‘ట్యాంక్‌ క్లీనర్‌’ సినిమాతో బాలీవుడ్‌లో తన సత్తా చాటింది. ప్రస్తుతం ‘గందీ బాత్‌’ సీజన్‌– 4 సిరీస్‌తో అలరిస్తోంది.  

అద్దె చెల్లించకుండా ఇంకొకరి జీవితంలో జీవించడమే నటన అంటే. అందుకే, నటీనటులందరూ చాలా అదృష్టవంతులు.

– మృదులా మహాజన్‌

మరిన్ని వార్తలు