Mr.Pregnant Movie: 'మిస్టర్ ప్రెగ్నెంట్' మూవీ ఎలా ఉంది?

17 Aug, 2023 18:46 IST|Sakshi

బిగ్‌బాస్ ఫేమ్ సొహెల్ హీరోగా నటించిన 'మిస్టర్ ప్రెగ్నెంట్'.. ఆగస్టు 18న థియేటర్లలోకి రాబోతుంది. ట్రైలర్ చూస్తుంటే సమ్‌థింగ్ డిఫరెంట్ అనిపించింది. ప్రమోషన్స్ కూడా కొత్తగా ట్రై చేశారు. ఇప్పుడు గర్భిణీల కోసం స్పెషల్‌గా ప్రీమియర్ షో వేశారు. దీంతో చూసొచ్చిన తర్వాత ఎలా ఉందో చెబుతున్నారు.

(ఇదీ చదవండి: పెళ్లి చేసుకోబోతున్న రానా తమ్ముడు! అమ్మాయి ఎవరంటే?)

సాధారణంగా మహిళలు గర్భం దాలుస్తుంటారు. ఒకవేళ అది మగాడికి వస్తే పరిస్థితి ఏంటి? చివరకు ఏమైంది అనే స్టోరీతో తీసిన మూవీ 'మిస్టర్ ప్రెగ్నెంట్'. సొహెల్, రూప హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు గర్బిణీల కోసం ప్రత్యేకంగా ఓ మల్టీప్లెక్స్ లో ప్రదర్శించారు. చూసొచ్చిన వాళ్లు.. డిఫరెంట్ స్టోరీ, హీరో యాక్టింగ్ బాగుందని మెచ్చుకుంటున్నారు. 

(ఇదీ చదవండి: పెళ్లిపై హీరో వరుణ్‌తేజ్ కామెంట్స్.. అలా చేసుకుంటానని!)

మరిన్ని వార్తలు