తాండమ్‌ రీమేక్‌:ఆదిత్యకు జోడీగా మృణాళ్‌ ఠాకూర్‌

7 Sep, 2021 08:09 IST|Sakshi

పోలీసాఫీసర్‌ డ్యూటీ చేయనున్నారట మృణాళ్‌ ఠాకూర్‌. ‘సూపర్‌ 30’, ‘బాల్తా హౌస్‌’, ‘తుఫాన్‌’ వంటి చిత్రాలతో బాలీవుడ్‌లో మంచి నటిగా పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీ తాజాగా మరో హిందీ చిత్రానికి సై అన్నారు. తమిళ హిట్‌ ‘తడమ్‌’ (తెలుగులో రామ్‌ చేసిన ‘రెడ్‌’) హిందీ రీమేక్‌లో మృణాళ్‌ ఒక హీరోయిన్‌గా నటించనున్నారు. ఆదిత్యారాయ్‌ కపూర్‌ హీరోగా నటించనున్న ఈ చిత్రంతో వర్థన్‌ కేట్కర్‌ దర్శకుడిగా పరిచయం కానున్నారు.

వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్‌ ఢిల్లీలో ప్రారంభం కానుంది. తమిళ ‘తడమ్‌’లోని అరుణ్‌ విజయ్‌ పాత్రను ఆదిత్య చేస్తుంటే.. విద్యాప్రదీప్‌ రోల్‌ను మృణాళ్‌ చేయనున్నారని తెలిసింది. నార్త్‌లో మంచి సినిమాలు చేస్తున్న మృణాళ్‌ సౌత్‌ ఎంట్రీ కూడా ఖరారైంది. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో మృణాళ్‌ హీరోయిన్‌గా చేస్తున్న సంగతి తెలిసిందే.

చదవండి : టక్‌ జగదీష్‌ : 'ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవుతారు'
MAA Elections 2021 : మసకబారుతున్న 'మా' ప్రతిష్ట..

మరిన్ని వార్తలు