చేదు అనుభవాన్ని పంచుకున్న హీరోయిన్‌

30 Apr, 2021 05:30 IST|Sakshi

కెరీర్‌లో కొంతదూరం ప్రయాణించాక కొందరు నటీనటులు తమ కెరీర్‌ తొలి రోజులను గుర్తు చేసుకుంటుంటారు. ఇటీవల తన కెరీర్‌ ఫస్ట్‌ డేస్‌ను గుర్తు చేసుకుని ఓ చేదు అనుభవాన్ని పంచుకున్నారు హీరోయిన్‌ మృణాళ్‌ ఠాకూర్‌. ‘‘హిందీలో నేను నటించిన తొలి సినిమా ‘లవ్‌ సోనియా’. ఈ సినిమాలో హీరోయిన్‌గా చాన్స్‌ వచ్చిందని తెలియగానే చాలా ఆనందపడ్డాను. కానీ ఈ సినిమా ఆఫీస్‌లో ఉన్న నోటీస్‌ బోర్డ్‌ చూసి షాకయ్యాను. సోనియా పాత్రకు... ఆప్షన్‌ 1, ఆప్షన్‌ 2, ఆప్షన్‌ 3.. అని ముగ్గురు హీరోయిన్ల పేర్లు ఉన్నాయి. ‘ఆప్ష్షన్‌ 3’లో నా పేరు ఉంది.

అది చూసి నా హృదయం బద్దలైంది. ఈ పాత్ర వస్తే పూర్తి న్యాయం చేయాలని నా మనసులో అనుకున్నాను. నా సంకల్పం మంచిదై సోనియాగా నటించే చాన్స్‌ నాకే వచ్చింది’’ అని పేర్కొన్నారు మృణాళ్‌. 2018లో హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో రూపొందిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఆ తర్వాత హృతిక్‌ రోషన్‌ ‘సూపర్‌ 30’, జాన్‌ అబ్రహాం ‘బాట్లా హౌస్‌’, ఫర్హాన్‌ అఖ్త్తర్‌ ‘తుఫాన్‌’లతో పాటు ‘ఘోస్ట్‌ స్టోరీస్‌’ అనే ఓ వెబ్‌ ఆంథాలజీలో కూడా మృణాళ్‌ నటించారు. తాజాగా మృణాళ్‌ నటించిన ‘జెర్సీ’ హిందీ రీమేక్‌ ఈ ఏడాది నవంబరు 5న విడుదల కానుంది. ఇందులో షాహిద్‌ కపూర్‌ హీరో.

చదవండి: Sushmita Konidela: సుష్మిత చేతిలోకి ఎనిమిది బుల్లెట్లు

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు