Mrunal Thakur: అప్పుడు ఏడ్చేశా .. కానీ చివరికీ సాధించా: మృణాల్ ఠాకూర్

21 Mar, 2023 15:33 IST|Sakshi

బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత సినిమాల్లో క్రేజ్‌ తెచ్చుకున్న సీతారామం బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌. బాలీవుడ్‌లో కొన్ని సినిమాలే చేసినా సీతారామం సినిమాతోనే ఫేమ్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో ఆమె అందానికి యూత్ ఫిదా అయ్యారు. ఆ సినిమాతో ఏకంగా దేశవ్యాప్తంగా ఫాలోయింగ్‌ పెంచుకుంది బ్యూటీ. అయితే తాజాగా మృణాల్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది

తాజాగా తన ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫోటోలో మృణాల్ ఠాకూర్ ఏడుస్తూ కనిపించింది. ఇది చూసిన ఆమె అభిమానులు ఏంటా అని ఆరా తీస్తున్నారు. అయితే  గతంలో తనకెదురైన చేదు అనుభవాలను వివరించేందుకే ఆ ఫోటోను షేర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం సంతోషంగానే ఉన్నానని వివరించింది. 

మృణాల్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాస్తూ.. 'నిన్న చాలా కష్టంగా గడిచింది. కానీ ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నా. ప్రతి ఒక్కరి కథలో కొన్ని చదవని పేజీలు కూడా ఉంటాయి. కానీ నేను వాటిని అందరితో పంచుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే నేను నేర్చుకున్న పాఠాన్ని ఇతరులకు నేర్పాలి.' అంటూ ఏడుస్తున్న ఆ ఫోటోను పంచుకున్నారు. మరో వీడియోను షేర్ చేస్తూ.. 'నాకు కఠిన పరిస్థితులు ఎదురైన రోజుల్లో ఆ ఫోటో తీసుకున్నా. కానీ ఈ రోజు మాత్రం అలా లేదు. చాలా సంతోషంగా ఉన్నా. నేను అనుకున్నది సాధించా.' అంటూ పోస్ట్ చేసింది.  ఇది చూసిన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. 

(ఇది చదవండి: మృణాల్‌ ఠాకూర్‌కు బెదిరింపులు.. అసలేం జరిగింది!)

కాగా..మృణాల్ 2012లో ముజ్సే కుచ్ కెహ్తీ...యే ఖామోషియాన్ అనే టీవీ షోతో తన ద్వారా నటన జీవితాన్ని ప్రారంభించింది. కుంకుమ్ భాగ్యతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 2018లో లవ్ సోనియాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. బాలీవుడ్‌లో సూపర్ 30, బాట్లా హౌస్, ఘోస్ట్ స్టోరీస్, తుఫాన్, ధమాకా వంటి చిత్రాలలో కనిపించింది. ఆ తర్వాత మరాఠీ, తెలుగు చిత్రాలలో కూడా కనిపించింది. అయితే దుల్కర్ సల్మాన్ సరసన నటించిన చివరి తెలుగు చిత్రం సీతారామం సూపర్ హిట్ అయ్యింది.మృణాల్ ఇటీవల అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీల చిత్రం సెఫ్లీలో కనిపించింది. ఇవే కాకుండా పూజా మేరీ జాన్, ఆంఖ్ మిచోలీ, తెలుగు నటుడు నానితో కలిసి నటించనుంది. 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు