ధోనితో బ్రేకప్‌పై లక్ష్మీరాయ్‌ షాకింగ్‌ కామెంట్‌!

4 Dec, 2021 14:25 IST|Sakshi

Dhoni And Raai Laxmi Breakup Story: టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ,  దక్షిణాది హాట్‌ భామ లక్ష్మీరాయ్‌ మధ్య అప్పట్లో లవ్‌ ట్రాక్‌ నడిచిన విషయం తెలిసిందే. 2008లో ఐపీఎల్‌ జట్టు చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా ధోనీ ఉన్నప్పుడు.. ఆ జట్టు ప్రచారకర్తగా లక్ష్మీరాయ్‌ వ్యవహరించింది. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య స్నేహం చిగురించి.. ప్రేమ మొగ్గ తొడిగిందని అంటారు. అప్పట్లో ఈ ఇద్దరూ డేటింగ్‌ చేసినట్టు కథనాలు హల్‌చల్‌ చేశాయి. అయితే, ఈ ఇద్దరి మధ్య అనుబంధం ఎక్కువకాలం కొనసాగలేదు. 2009లో వీరిద్దరు బ్రేకప్‌ చెప్పుకున్నారు. ఆ తర్వాత ధోని సాక్షిని పెళ్లి చేసుకున్నాడు. రాయ్‌ లక్ష్మీ మాత్రం ఇప్పటికీ వివాహం చేసుకోలేదు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ హాట్‌ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో ధోనితో బ్రేకప్‌ గురించి చెప్పుకొచ్చింది. ధోనితో కొనసాగించిన రిలేషన్‌ తన జీవితంలో ఓ మచ్చగా మిగిలిపోయిందని పేర్కొంది. తనతో బ్రేకప్‌ జరిగి 12 ఏళ్లు గడిచిన.. ఈ విషయం ఇప్పటికీ తనను వెంటాడుతూనే ఉందన్నారు. ధోని గురించి మీడియాలో ఏదైన చర్చ వస్తే.. తన పేరును ప్రసావిస్తున్నారని వాపోయింది. తనకు పెళ్లై, పిల్లకు పుట్టినా.. ధోనితో అఫైర్‌ గురించి మాట్లాడుతూనే ఉంటారేమోనని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తాము బ్రేకప్‌ చెప్పుకున్నప్పటికీ.. ఒకరిపై ఒకరికి గౌరవం ఉందన్నారు. ధోనీ తర్వాత తన జీవితంలో చాలా బ్రేకప్స్‌ జరిగాయని, కానీ వాటిని ఎవరూ గమనించలేదని చెప్పింది. ప్రస్తుతం తన దృష్టి కెరీర్‌ పైనే ఉందని, పెళ్లి ఆలోచన ఇప్పట్లోదేని స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు