'7 డేస్‌ 6 నైట్స్‌'.. డర్టీ హరీని మించి ఉంటుంది

10 May, 2021 00:22 IST|Sakshi

– ఎంఎస్‌ రాజు

‘శత్రువు’, ‘దేవి’, ‘మనసంతా నువ్వే’, ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఎంఎస్‌ రాజు దర్శకునిగా మారిన సంగతి తెలిసిందే. గత ఏడాది ‘డర్టీ హరి’తో దర్శకుడిగా మంచి విజయం అందుకున్న ఎంఎస్‌ రాజు పుట్టినరోజు నేడు (మే 10). ఈ సందర్భంగా దర్శకుడిగా తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. సుమంత్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో వైల్డ్‌ హనీ ప్రొడక్షన్‌ పతాకంపై ‘7 డేస్‌ 6 నైట్స్‌’ పేరుతో ఈ చిత్రం తెరకెక్కనుంది. వింటేజ్‌ పిక్చర్స్, ఏబీజీ క్రియేషన్స్‌ వారు ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములు.

సుమంత్‌ అశ్విన్, రజనీకాంత్‌ .ఎస్‌ నిర్మాతలు. ఈ సందర్భంగా సుమంత్‌ అశ్విన్‌ మాట్లాడుతూ– ‘‘జూన్‌ 7న ‘7 డేస్‌ 6 నైట్స్‌’ చిత్రీకరణ ప్రారంభించాలనుకుంటున్నాం. హైదరాబాద్, గోవా, మంగుళూరు, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో షూటింగ్‌ చేయనున్నాం. ప్రస్తుతానికి నటీనటుల వివరాలు గోప్యంగా ఉంచుతున్నాం’’ అన్నారు. ఎంఎస్‌ రాజు మాట్లాడుతూ– ‘‘న్యూ ఏజ్‌ రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. ‘డర్టీ హరి’ని మించి ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సమర్థ్‌ గొల్లపూడి, కెమెరా: నాని చమిడిశెట్టి, లైన్‌ ప్రొడ్యూసర్‌: జె. శ్రీనివాసరాజు, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: యువి సుష్మ, కో ప్రొడ్యూసర్‌: మంతెన రాము.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు