‘7 డేస్‌ 6 నైట్స్‌’ వసూళ్లు పెరుగుతున్నా చిన్న వెలితి: ఎంఎస్‌ రాజు   

26 Jun, 2022 07:18 IST|Sakshi

‘‘మా ‘7 డేస్‌ 6 నైట్స్‌’ సినిమాని ప్రేక్షకులతో కలిసి థియేటర్‌లో చూశాను.. వారు బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు.. చాలా సంతోషంగా అనిపించింది’’ అని డైరెక్టర్‌ ఎంఎస్‌ రాజు అన్నారు. సుమంత్‌ అశ్విన్, రోహన్‌ హీరోలుగా మెహర్‌ చాహల్, కృతికా శెట్టి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘‘7 డేస్‌ 6 నైట్స్‌’. సుమంత్‌ అశ్విన్‌ .ఎం, రజనీకాంత్‌ .ఎస్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలయింది.

(చదవండి: అప్పుడు నాకు ఆ సెన్స్‌, జ్ఞానం లేదు: నాగబాబు)

ఈ చిత్రం సక్సెస్‌ మీట్‌లో చిత్రదర్శకుడు ఎంఎస్‌ రాజు మాట్లాడుతూ– ‘‘శంకరాభరణం’ నుంచి ఇప్పటివరకు క్లాసిక్‌ సినిమాల వసూళ్లు మౌత్‌ టాక్‌ వల్ల పెరిగాయి. మా సినిమాకి కూడా మౌత్‌ టాక్‌తో ప్రతి షోకి అన్ని చోట్ల వసూళ్లు పెరుగుతుండటం హ్యాపీ. అయితే, ఒక చిన్న వెలితి.

ఈ రోజు తెలుగు ఇండస్ట్రీ పెద్ద సినిమాలకు మాత్రమే పరిమితం అయ్యిందనేది చాలా మంది ఉద్దేశం. ఇప్పుడు దాసరి నారాయణరావుగారిలా, కె.బాలచందర్‌గారిలా చిన్న సినిమాలు, ప్రయోగాత్మక చిత్రాలు చేస్తే?, ఈ రోజు ‘హ్యాపీ డేస్‌’ లాంటి సినిమాలు వస్తే? పరిస్థితి ఏంటి? అని ఆలోచించాల్సిన పరిస్థితి. చిన్న సినిమాలకు, నాలుగు కోట్ల బడ్జెట్‌ లోపు చిత్రాలకు టికెట్‌ రేట్లు తగ్గించాలి. రూ.200 టికెట్‌ పెట్టి చిన్న సినిమాలను ఎవరు చూస్తారు?. ప్రభుత్వాలతో చర్చించి ధర తగ్గించేలా నిర్ణయం తీసుకోవాలి’’ అన్నారు. 

మరిన్ని వార్తలు