నమ్రత పోస్టుపై హర్ట్‌ అయిన నిర్మాత..

16 Jan, 2021 11:04 IST|Sakshi

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు నటించిన ‘ఒక్కడు’ సినిమా విడుదలై శుక్రవారానికి 18 ఏళ్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మహేష్‌ భార్య నమ్రతా శిరోద్కర్‌ ఒక్కడు సినిమాను గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ‘మహేష్‌ సినిమాల్లో ఒక్కడు క్లాసిట్‌ హిట్‌. మళ్లీ మళ్లీ చూడలనించే సినిమా.. ఒక్కడు నాకు ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ అని పేర్కొన్నారు. ఇక్కడి వరకు అంతా బానే ఉన్నా ఈ పోస్టు ప్రస్తుతం చర్చకు దారి తీసింది. పోస్టులో.. చిత్రయూనిట్‌ సభ్యులైన మహేష్, భూమిక, గుణశేఖర్, ప్రకాష్ రాజ్, ఫైట్ మాస్టర్ విజయన్, మణిశర్మ ఇలా అందరి పేర్లను నమ్రత ప్రస్తావించింది. అయితే వీరిలో నిర్మాత ఎమ్‌ఎస్‌ రాజును మాత్రం మర్చిపోయింది. చదవండి: మహేష్‌ సినిమాకు 18 ఏళ్లు.. నమ్రత కామెంట్‌

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

తాజాగా ఈ విషయాన్ని గమనించిన నిర్మాత ఎమ్‌ఎస్‌‌ రాజు నమ్రత ట్వీట్‌పై స్పందించారు. ఒక్కడు సినిమా గురించి పేర్కొనే సమయంలో నమ్రత తన పేరును ప్రస్తావించలేదని ఎమ్‌ఎస్‌ రాజు హర్ట్‌ అయ్యారు. తనకు దక్కాల్సిన గౌరవం దక్కలేదన్న కారణంతో అప్‌సెట్‌ అయ్యారు. ఈ మేరకు ట్విటర్‌లో ‘ పొరపాట్లు జరుగుతుంటాయి బాబు. నమ్రతగారు ఒక్కడు గురించి మాట్లాడుతూ నా పేరును మర్చిపోయారు. అయినా నాకు సంతోషమే. ఈ సినిమా ఆమెకు ఫెవరెట్‌ మూవీ అయినందుకు. గుడ్‌లక్‌’ అంటూ ట్వీట్‌ చేసి మహేష్‌ను ట్యాగ్‌ చేశారు. మరి ఎమ్ఎస్‌ రాజు ట్వీట్‌ను మహేష్‌ చూస్తాడా.. దీనిపై నమ్రత స్పందిస్తుందో లేదో తెలియాలంటే వేచి చూడాలి.  ఇదిలా ఉండగా ఈ ట్వీట్‌ను చూసిన నెటిజన్లు మాత్రం మీరు లేకుండా ఒక్కడు సినిమా లేదు సార్‌.. ఇంతటి గొప్ప సినిమాను అందించనందుకు కృతజ్ఞతలు అని కామెంట్‌ చేస్తున్నారు. 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు