ఇద్దరి మధ్య 18 ఏళ్ల వ్యత్యాసం.. అయితే ఏంటి?

23 Jan, 2021 14:56 IST|Sakshi

రాహుల్‌ దేవ్‌తో నటి సహజీవనం

ముంబై: ఎవరైనా, ఎపుడైనా, ఎవరితోనైనా ప్రేమలో పడవచ్చని, దానికి వయసుతో సంబంధం ఉండదని అంటున్నారు నటి ముగ్ధా గాడ్సే. కొన్ని విషయాలు మన ప్రమేయం లేకుండానే జరిగిపోతాయని, మనసుకు నచ్చిన వారితో జీవితం పంచుకోవడం కంటే ఆనందం మరేదీ ఉండదని పేర్కొన్నారు. కాగా మోడల్‌గా కెరీర్‌ ఆరంభించిన ముగ్దా గాడ్సే.. మాధుర్‌ భండార్కర్‌ ‘ఫ్యాషన్‌’తో నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. గలీ గలీ చోర్‌ హై, విల్‌ యూ మ్యారీ మీ?, హీరోయిన్‌ వంటి సినిమాల్లో తళుక్కుమన్నారు. ఇక వ్యక్తిగత విషయాకొనిస్తే, గత కొన్నేళ్లుగా ముగ్ధా, నటుడు రాహుల్‌ దేవ్(52)‌తో సహజీవనం చేస్తున్నారు. వీరి ప్రేమ బంధానికి త్వరలోనే ఎనిమిదేళ్లు నిండబోతున్నాయి. 

ఈ నేపథ్యంలో జూమ్‌ టీవీతో మాట్లాడిన ముగ్ధ.. రాహుల్‌ దేవ్‌ తాను తమ బంధం పట్ల సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. ఇక ఇద్దరి మధ్య ఉన్న వయసు వ్యత్యాసం గురించి చెబుతూ.. ‘‘భాగస్వామిని ఎంచుకోవడం అంటే షాపింగ్‌ చేయడం వంటిది కాదు కదా. నాకు ఈ కలర్‌ బ్యాగ్‌ నచ్చింది కాబట్టి కొనుక్కుంటున్నాను అన్నట్లుగా ఉండదు. ప్రేమ ఎప్పుడు పుడుతుందో ఎవరికీ తెలియదు. ఎవరికైనా ప్రత్యక్ష అనుభవంలోకి వస్తేనే ఈ విషయం అర్థమవుతుంది. వయసుతో అసలు సంబంధం ఉండదు’’అని పేర్కొన్నారు. కాగా టాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలో ప్రతి నాయకుడి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించిన రాహుల్‌ దేవ్‌కు గతంలో రీనాతో వివాహం జరిగింది. (చదవండి: ఎనిమిదేళ్ల చిన్నవాడిని పెళ్లాడిన నటి)

వీరికి సిద్ధాంత్‌ అనే కుమారుడు కూడా ఉన్నాడు. ఇక క్యాన్సర్‌ బారిన పడిన రీనా 2009లో మరణించడంతో రాహుల్‌ ఒంటరివాడయ్యాడు. ఈ క్రమంలో ఓ పెళ్లిలో ముగ్ధాతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. అన్నట్లు.. ముగ్ధా రాహుల్‌ కంటే వయసులో సుమారు 18 ఏళ్లు చిన్నది. దీంతో గతంలో అనేకమార్లు ఈ విషయాన్ని టార్గెట్‌ చేస్తూ నెటిజన్లు ట్రోల్‌ చేశారు. అయితే, రాహుల్‌ మాత్రం తమ ఇరు కుటుంబాలకు తమ బంధం పట్ల అభ్యంతరాలు లేవని, సంతోషంగా ఉంటే వయస్సు అనేది పెద్ద సమస్య కాదంటూ కౌంటర్‌ ఇచ్చాడు. (చదవండి: వయస్సులో చిన్నవాళ్లను పెళ్లాడిన సెలబ్రిటీలు)

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు