Manchu Manoj: ముహూర్తం ఫిక్స్‌ చేసిన మనోజ్‌.. క్షణాల్లో ట్వీట్‌ వైరల్‌

19 Jan, 2023 21:04 IST|Sakshi

టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్‌ సినిమాలకు దూరమై దాదాపు ఐదేళ్లు కావస్తోంది. 'ఒక్కడు మిగిలాడు' తర్వాత మరే సినిమాలోనూ నటించలేదు. ఆ మధ్య 'అహం బ్రహ్మాస్మి' అంటూ పాన్‌ ఇండియా సినిమాను ప్రకటించాడు కానీ దాని గురించి ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు. గత నెలలో కడప పెద్ద దర్గాను సందర్శించిన సమయంలో త్వరలో కొత్త జీవితం ప్రారంభించబోతున్నా అని చెప్పాడీ హీరో. దీంతో అభిమానుల్లో అనేక సందేహాలు మొదలయ్యాయి. కొత్త జీవితం అంటే కొత్త సినిమాలా? లేక మళ్లీ పెళ్లా? అని అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జీవితంలో కొత్త ప్రయాణం ప్రారంభించబోతున్నా అంటూ బుధవారం ట్వీట్‌ చేయగా క్షణాల్లోనే అది వైరల్‌గా మారింది.

తాజాగా ఆ శుభవార్తను వెల్లడించడానికి టైం ఫిక్స్‌ చేశాడు మనోజ్‌. 'ముహూర్తం ఫిక్స్‌.. రేపు ఉదయం 9.45 గంటలకు గుడ్‌ న్యూస్‌ చెప్తాను. మీకు ఎప్పుడెప్పుడు చెప్దామా అని ఎదురుచూస్తున్నాను' అంటూ ట్వీట్‌ చేశాడు. ఇది చూసిన అభిమానులు సినిమానా? పెళ్లా? మాకీ టెన్షన్‌ ఏంటి బ్రో అని కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే కచ్చితంగా పెళ్లి గురించే అని ఫిక్స్‌ అయిపోయి 'వదిన పేరు చెప్పు', 'మమ్మల్ని కూడా పెళ్లికి పిలువు' అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంతకీ మంచు మనోజ్‌ చెప్పబోయే గుడ్‌న్యూస్‌ ఏంటో తెలియాలంటే రేపు ఉదయం వరకు ఆగాల్సిందే!

చదవండి: ఒక్క భార్య ముద్దు.. ఇద్దరంటే కష్టమే: నటుడు
స్టార్‌ హీరో ఇంట్లో అద్దెకు దిగిన యంగ్‌ హీరో

మరిన్ని వార్తలు