ప్రముఖ కామెడీ షోపై నటుడి సంచలన వ్యాఖ్యలు

6 Oct, 2020 11:05 IST|Sakshi

ముంబై: ప్రముఖ టీవీ నటుడు ముఖేష్‌ కన్నా తరచూ సహనటులపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వివాదంలో ఉంటారు. ఇటీవల హీరోయిన్‌ సోనాక్షి సిన్హాపై విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ప్రముఖ కామెడీ కపిల్‌ శర్మ షోపై కూడా వ్యంగ్య వ్యాఖ్యలు చేశాడు. అంతేగాక ఆ షోకు ఆహ్వానం అందినప్పటికీ హాజరు కాకపోవడంపై గల కారణాన్ని కూడా వెల్లడించాడు. ఇటీవల మహాభారతం సీరియల్‌ సభ్యులను కపిల్‌ శర్మ ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఇందులో ముఖేష్‌  కన్నా కూడా ఉన్నారు. కానీ ఆయన షోకు హాజరు కాలేదు. దీంతో భీష్మా పితామాహ మహాభారతం‌ ప్రదర్శనలో ఎందుకు పాల్గొనలేదు అంటూ షోషల్‌ మీడియాలో ప్రశ్నలు వెల్లువెతున్నాయి. (చదవండి: ‘సోనాక్షిని కించపరిచే ఉద్దేశం నాకు లేదు’)

అంతేగాక ఆయనను షోకు ఎందుకు ఆహ్వనించలేదని కూడా అభిమానులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై స్పందిస్తూ అభిమానులకు సోషల్‌ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. మంగళవారం ట్వీట్‌ చేస్తూ.. ‘నన్ను కపిల్‌ శర్మ షోకు నిరాకరించారని అందరూ అంటున్నారు. నేనే నిరాకరించానని మరి కొందరు అంటున్నారు. ఏదేమైనా షోకు నాకు ఆహ్వానం అందలేదన్న వార్తల్లో నిజం లేదు. నేనే కపిల్‌ శర్మ ఆహ్వానాన్ని తిరస్కరించాను. ఎందుకు తిరస్కరించానని కూడా నన్ను అడుగుతున్నారు. కపిల్‌ శర్మ తన షోకు మహాభారతం టీంను ఆహ్వానించనున్నట్లు గుఫీ నాకు ముందే చెప్పాడు. అప్పుడు మీరు వెళ్లండి నేను రాను అని చెప్పాను’ అని పేర్కొన్నాడు. (చదవండి: ఎక్తా కపూర్‌పై విరుచుకుపడ్డ ‘శక్తిమాన్‌’ హీరో)

అయితే ‘‘ఈ షోకు ప్రముఖ స్టార్‌ నటులంతా వెళ్తారు.. కానీ ముఖేష్‌ కన్నా మాత్రం వెళ్లడు. ఎందుకంటే కపిల్‌ షో దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందినప్పటికీ.. దాని కంటే చెత్త షో మరోకటి ఉండదని నా అభిప్రాయం. ఈ షో మొత్తం డబుల్‌ మీనింగ్‌ పదాలతో నిండి ఉంటుంది. ప్రతి క్షణం అసభ్యత ఉట్టిపడుతోంది. ఇందులో పురుషులు స్త్రీల దుస్తులు ధరించి చెత్త ప్రదర్శన ఇస్తారు. దానిని ప్రజలు నవ్వుతూ కడుపులు పట్టుకుంటారు’’ అంటూ విమర్శలు గుప్పించారు. అయితే లాక్‌డౌన్‌ రామాయణం, మహాభారతం సీరియల్లు తిరిగి పున: ప్రసారం అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కపిల్‌ తన షోకు మహాభారతం​ తారాగాణాన్ని ఇటీవల ఆహ్వానించాడు. దీనికి నితీష్ భరద్వాజ్, పునీత్ ఇస్సార్, ప్రదీప్ కుమార్, గజేంద్ర చౌహాన్, గుఫీ పెయింట, అర్జున్ ఫిరోజ్ ఖాన్‌లు ‌హాజరయ్యారు.

Baat ki khaal, aao 🐃 behas kare’n 🤪 #thekapilsharmashow #comedy #comedyvideos #fun #laughter #weekend #masti #family #familytime don’t miss it this weekend 🥳🥳🥳🤪🤪

A post shared by Kapil Sharma (@kapilsharma) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు