‘సైఫ్‌.. మాట్లాడే ముందు ఎందుకు ఆలోచించవ్‌’

9 Dec, 2020 12:32 IST|Sakshi

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ప్రధాన పాత్రలో ఓమ్‌ రౌత్‌ దర్శకత్వం వహించనున్న సినిమా ఆదిపురుష్‌. ఈ సినిమాతో ప్రభాస్‌ బాలీవుడ్‌లో డైరెక్ట్‌గా ఎంట్రీ ఇవ్వనున్నారు. వచ్చే ఏడాది జనవరిలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీలో... ప్రభాస్‌ రాముడి పాత్రలో నటించనుండగా.. బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ రావణాసురిడిగా కనిపించనున్నారు. ఇక సీత పాత్రలో ఎవరూ నటించనున్నరనే వార్త తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా అనేక మంది స్టార్ హీరోయిన్స్ ని పరిశీలించిన చిత్ర యూనిట్ చివరికి కృతి సనన్‌ ఫైనల్‌​ చేశారు. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాను 2022 ఆగస్ట్‌ 11న ఈ సినిమాను థియేటర్స్‌లోకి తీసుకురాబోతున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. చదవండి: ప్రభాస్‌ మూవీపై కామెంట్‌.. సారీ చెప్పిన సైఫ్‌ అలీఖాన్‌

కాగా ఆదిపురుష్‌లోని రావణ పాత్రపై సైఫ్‌ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. ఇటీవల సైఫ్‌ అలీఖాన్‌ ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. సినిమా గురించి పలు వ్యాఖ్యలు చేశారు. సినిమాలో రావణ పాత్ర చేయడం ఆసక్తికరంగా ఉందన్నారు. రావణుడు సీతను ఎందుకు అపహరించడని, రాముడితో యుద్దం ఎందుకు చేశాడనే కోణంలో సినిమా ఉండబోతుందని వెల్లడించారు. అలాగే రావణాసురుడిలోని మానవత్వ కోణాన్ని ఆవిష్కరించే విధంగా ఈ సినిమాలో చూపించబోతున్నామన్నారు. దీంతో సైఫ్‌ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో వివాదస్పదంగా మారాయి. హిందువులు రాక్షసుడిగా భావించే రావణాసురుడిని సైఫ్‌ పొగడటం ఓ వర్గానికి నచ్చడం లేదు. సైఫ్‌ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్రోల్స్‌ చేశారు. చదవండి: మీటూ ఉద్యమానికి మహిళలే బాధ్యులు

తాజాగా సైఫ్‌ చెప్పిన క్షమాపన వ్యాఖ్యలపై బాలీవుడ్‌ నటుడు ముఖేష్ ఖన్నా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖేష్‌ ఓ వీడియోను విడుదల చేశారు. ‘చిత్రనిర్మాతలు ఇప్పటికీ మన మతంపై దాడి చేయడానికి సినిమాలను ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. లక్ష్మి బాంబు ఇటీవలే పేలింది. ఇప్పుడు మరొక దాడి ప్రారంభమైంది. ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు. ఇది చాలా తేలిక అని సైఫ్ ఎందుకు భావిస్తున్నాడో తెలియదు. లంకేష్ మీ బ్యాట్‌తో స్పిన్ చేయాలనుకునే బంతి కాదు. నేను మీ మాటలను అమాయకత్వం అనలా లేక మూర్ఖత్వం అని పిలవాలా?దేశంలోని కోట్ల మంది భారతీయుల విశ్వాసంతో వారు ఆడుతున్నారని, కనీసం అది తమకు తెలుసని లేదా ఉద్దేశపూర్వకంగానే ఈ విషయాలు చెబుతున్నారని వారికి తెలియదు. తనను తాను మేధావి అని పిలిచే దర్శకుడు, నిర్మాతకు ఇలాంటి సినిమాలు చేయాలనే కోరిక ఇంకా ఉందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

“ఇతర మతాల పాత్రలతో ఇలాంటి ఆట ఆడటానికి ప్రయత్నించండి. చెడును మంచిగా, మంచిని చెడుగా చూపించండి. వారు మిమ్మల్ని కొట్టేస్తారు. రాముడు రావణుడు కాడు. అదే విధంగా రావణుడు రాముడు కాకూడదు. కాబట్టి దయ చేసే రావణుడికి ఈ ఆట ఎందుకు? ఇందులో కూడా ఏదైనా ఉద్దేశ్యం ఉందా? లేదా సినిమా ప్రమోషన్‌లో భాగమా..అని నేను చెప్పలేను. ప్రజలు దీని గురించి ఆలోచించాలి. నేను చెడుగా భావించాను కాబట్టి నేను ఈ విషయం చెప్పాను. మీరు కూడా ఆలోచించాలి ఇది సరైనదా కాదా అని అన్నారు. సైఫ్‌ క్షమాపణలు కోరడంపై స్పందిస్తూ.. ‘బాణం వేసి, బాంబ్‌ విసిరి, ఒకరిని కొట్టి ఆ తర్వాత క్షమించండి అంటే అంగీకరించలేము. మాట్లాడే ముందే మీరు ఎందుకు ఆలోచించరు’ .అంటూ ముగించారు.

A post shared by Mukesh Khanna (@iammukeshkhanna)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు