మీటూ ఉద్యమానికి మహిళలే బాధ్యులు

31 Oct, 2020 12:59 IST|Sakshi

ముఖేష్‌ ఖన్నా అనుచిత వ్యాఖ్యలు

ముఖేష్‌ ఖన్నాపై మండిపడుతున్న నెటిజనులు

ముంబై: సూపర్‌ హీరో ‘శక్తిమాన్’ ముఖేష్‌ ఖన్నా సహానటులపై, సామాజిక విషయాలపై తరచూ వ్యంగ్య వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా ఆయన మీ టూ ఉద్యమంపై అనుచిత వ్యాఖ్యలు చేసి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన వ్యాఖ్యలను నెటిజన్‌లు, మహిళా సంఘాలు తీవ్రంగా ఖండిస్తూ ఆయనపై విరుచుకుపడుతున్నారు. ఇటీవల ఓ ఇంటర్య్వూలో ఆయన మీ టూ ఉద్యమంపై మాట్లాడుతూ.. మీటూ ఉద్యమానికి మహిళలే బాధ్యులు అని వ్యాఖ్యానించారు. ‘మహిళలు ఇంటి పనికి బాగా సరిపోతారు. అయితే మీ టూ ఉద్యమం మొదలైంది వారి వల్లే. ఎందుకంటే ఇంటి పని చేసుకోవడం మహిళ బాధ్యత. కానీ వారు అది చేయకుండా బయటకు వచ్చి పురుషులకు పోటీ పడటం(పురుషులతో భుజం-భజం కొట్టుకోవడం) ప్రారంభించారు. అందువల్లే మీ టూ ఉద్యమం మొదలైంది. దీనికి బాధ్యత వహించాల్సింది కూడా మహిళలలే’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో నెటిజన్‌లు ముఖేష్‌ కన్నాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: దానికంటే చెత్త షో మరొకటి ఉండదు: ముఖేష్‌ కన్నా)

‘గతంలో మీరు చేసిన పాత్రలకు అందరూ మిమ్మల్ని గౌరవిస్తున్నారు. అలాంటి మీ నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం నిరాశపరిచింది’, ‘ఈ వ్యక్తే మనం బాల్యంలో ఆదర్శంగా తీసుకున్న సూపర్‌ హీరో. చూడండి ఆయన ఆలోచనలు, మాటలు ఎలా ఉన్నాయో’, ‘మహిళలు పని చేయడానికి బయటకు వస్తే పురుషులు లైంగిక వేధింపులకు అర్హులు.. కానీ మహిళలు వారి భద్రత కోసం ఇంట్లోనే ఉండాలా?. ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కోంచమైన సిగ్గండాలి ముఖేష్‌ కన్నా’ అంటూ నెటిజన్‌లు మండిపడుతూ ఆయనపై ధ్వజమెత్తుతున్నారు. అయితే హీరోయిన్‌ సోనాక్షి సిన్హాకేబీసీలో రామాయణంపై అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకపోవడంపై ఆమెను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతేగాక నిర్మాత ఎక్తాకపూర్‌, ప్రముఖ కామెడీ కపిల్‌ శర్మ షోలను కూడా కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడు. అయితే బీఆర్‌ చొప్రా నిర్మించిన మహాభారతంతో భీష్మ పితామహా పాత్రలో నటించి అందరి మన్నలు పొందారు. అంతేగాక సూపర్‌ హీరో‌ శక్తిమాన్‌లో లీడ్‌రోల్‌ చేసి చిన్నారులను ఆకట్టుకున్నారు.  (చదవండి: ‘సోనాక్షిని కించపరిచే ఉద్దేశం నాకు లేదు’)

మరిన్ని వార్తలు