డ్రగ్‌ కేసు: రియా రిమాండ్‌ను పొడిగించిన ముంబై కోర్టు

6 Oct, 2020 14:23 IST|Sakshi

ముంబై: సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో వెలుగు చూసిన డ్రగ్‌ వ్యవహారంలో అరెస్టైన సుశాంత్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ రియా చక్రవర్తి కస్టడిని ముంబై సెషన్స్‌ కోర్టు పొడిగించింది. రియా సుశాంత్‌కు డ్రగ్స్‌ సేకరిచిందనే ఆరోపణలు రుజువు కావడంతో నార్కొటిక్‌ కంట్రోల్‌ బ్యూరో సెప్టంబర్‌ 9 అరెస్టు చేసి ముంబైని బైకుల్లా మహిళ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఈ కేసులో రియాతో పాటు ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తితో సహా మరో నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌ తరలించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి కస్టడిని అక్టోబర్‌ 20 వరకు పోడిగిస్తున్నట్లు ముంబై సెషన్స్‌ కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా సెప్టెంబర్‌లో బెయిల్‌ కోరుతూ రియా ముంబై కోర్టులో పిటిషన్‌ ధాఖలు చేసింది. కానీ కోర్టు తన పిటిషన్‌ రిజర్వులో ఉంచింది. అయితే దీనిపై తదుపరి ఉత్తర్వును బుధవాంర వెల్లడించే అవకావం ఉన్నట్లు సమాచారం. (చదవండి: సుశాంత్‌ది ఆత్మహత్యే.. హత్య కాదు!)

అయితే డ్రగ్‌ కేసులో నేర నిరూపణ కావడంతో రియా ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తి, సుశాంత్ హౌస్ మేనేజర్ శామ్యూల్ మిరాండాలతో పాటు మరో ముగ్గురిని ముంబై సెషన్స్‌ కోర్టు అక్టోబర్‌ 6 వరకు జ్యూడిషియల్‌ కస్టడికి పంపించింది. ఈ క్రమంలో బెయిల్‌ కోరుతూ రియా ఆమె సోదరుడు షోవిక్‌తో సహా ఇతర నిందితులు దాఖలు చేసిన పిటిషన్‌ను ఎన్‌సీబీ త్రీవంగా వ్యతిరేకించింది. వారి బెయిల్ విచారణ సమయంలో యువకులకు వారు మాదకద్రవ్యాలను సరఫరా చేయలేదన్న నేర ఆరోపణ నిర్థారణకు వచ్చే వరకు వారికి బెయిల్‌ మంజూరు చేయోద్దని కోర్టును ఎన్‌సీబీ విజ్ఞప్తి చేసింది. ఇందుకోసం డ్రగ్‌ వ్యవహారంలో డ్రగ్‌ సిండికెట్‌ క్రియాశీల సభ్యులు, సుశాంత్‌ మృతి కేసు సంబంధించిన ప్రారంభ దర్యాప్తును కూడా సమీక్షిస్తామని ఎన్‌సీబీ కోర్టుతో పేర్కొంది. (చదవండి: డ్రగ్స్‌ కేసులో ముగ్గురు బడా హీరోలు!)

చదవండి: అదో బోగస్‌ ప్రచారం.. సిగ్గుతో ఉరేసుకోండి!

మరిన్ని వార్తలు