సుశాంత్‌ కేసు: రియా సోదరుడికి బెయిల్‌

2 Dec, 2020 16:09 IST|Sakshi

ముంబై: దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ మృతి కేసులో ప్రధాన నిందితురాలు నటి రియా చక్రవర్తికి అక్టోబర్‌లో ముంబై కోర్టు బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె సోదరుడు సోవిక్‌ చక్రవర్తికి కూడా ముంబై స్పెషల్‌ కోర్టు బుధవారం బెయిల్‌ మంజురూ చేసింది. అయితే సుశాంత్‌ మృతి కేసుతో వెలుగు చూసిన బాలీవుడ్‌ డ్రగ్‌ కేసులో రియా, ఆమె సోదరుడు సోవిక్‌, సుశాంత్‌ ఇంటి మెనేజర్‌ శామ్యూల్‌ మిరాండాతో పాటు పలువురిని సెప్టెంబర్‌ 4న నార్కొటిక్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రియా, ఆమె సోదరుడు సోవిక్‌కు డ్రగ్‌ ప్లెడర్‌లతో సంబంధాలు ఉన్నాయని వారు సుశాంత్‌కు డ్రగ్ కూడా‌ సప్లై చేసినట్లు ఆధారాలు కూడా ఉన్నాయని ఎన్‌సీబీ అధికారులు వెల్లడించడంతో వారిని ముంబై హైకోర్టు జైలుకు తరలించింది. ఈ నేపథ్యంలో రియా, సోవిక్‌లు బెయిల్‌ కోరుతూ సెప్టంబర్‌ చివరి వారంలో కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. (చదవండి: ‘అందుకే రియా, సుశాంత్‌ ఇంటిని వీడింది’)

అయితే అక్టోబర్‌లో రియాకు బెయిల్‌ను మంజూరు చేసిన కోర్టు సోవిక్‌ బెయిల్‌ను రద్దు చేసింది. అనంతరం నవంబర్‌ మొదటి వారంలో సోవిక్‌ మళ్లీ బెయిల్‌ పటిషన్‌ దాఖలు చేశాడు. అయితే ఈసారి సోవిక్‌ బెయిల్‌ పిటిషన్‌ను విచారించిన ముంబై హైకోర్టు ఎన్‌సీబీ అధికారులు ఇచ్చిన సాక్ష్యాలు అమోధయోగ్యం లేవని సోవిక్‌కు బెయిల్‌ మంజూరు చేసినట్లు పేర్కొంది. కాగా ఈ ఏడాది జూన్‌ 14వ సుశాంత్‌ సింగ్‌ ముంబైని తన నివాసంలో ఆత్మహత్య చేసుకుని మరణించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముంబై పోలీసులు అతడి ప్రియురాలు రియాను అనుమానిస్తూ విచారణ చేపట్టగా డ్రగ్‌ కేసు వెలుగు చూసింది. దీంతో ముంబై పోలీసుల ఈ కేసు విచారణను ఎన్‌సీబీ అధికారులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో రియాను విచారించగా ఆమెకు, సోవిక్‌కు డ్రగ్‌ ప్లెడర్‌లతో సంబంధాలు ఉన్నట్లు వెల్లడైంది. ఈ విచారణలో రియా బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌లు దీపికా పదుకొనె, శ్రద్దా కపూర్‌, అలియా భట్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ల పేర్లను కూడా చెప్పడంతో ఎన్‌సీబీ వారిని కూడా విచారించిన విషయం తెలిసిందే. (చదవండి: సుశాంత్‌ కేసు: గాబ్రియెల్లా సోదరుడు అరెస్ట్‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా