Rakesh Maria Biopic By Rohit Shetty: తెరపైకి ఆ పోలీస్​ కమీషనర్ బయోపిక్.. ​

30 Apr, 2022 13:53 IST|Sakshi

Mumbai Former Police Commissioner Rakesh Maria Biopic By Rohit Shetty: బాలీవుడ్​ స్టార్​ డైరెక్టర్​ రోహిత్​ శెట్టి యాక్షన్ అండ్ కామెడీ సినిమాలకు పెట్టింది పేరు. ఇటీవల అక్షయ్​ కుమార్​తో సూర్యవంశీ తెరకెక్కించి హిట్ కొట్టాడు. అమెజాన్​ ఓటీటీ కోసం ఇండియన్ పోలీస్ ఫోర్స్ అనె వెబ్ సిరీస్​ను రోహిత్​ శెట్టి డైరెక్ట్ చేయనున్న విషయం తెలిసిందే. తాజాగా రోహిత్ శెట్టి మరో సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. అది కూడా ముంబై ఎక్స్​ పోలీస్​ కమీషనర్​ రాకేష్​ మారియా బయోపిక్​ను తెరకెక్కించనున్నాడు రోహిత్. రాకేష్ మారియా తన కెరీర్​లో సాధించిన విజయం ఆధారంగా ఈ బయోపిక్​ రూపుదిద్దుకోనుంది. 

ఈ బయోపిక్​ను తెరకెక్కిస్తున్నట్లు రోహిత్ శెట్టి అధికారికికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా రోహిత్​ శెట్టి మాట్లాడుతూ 'రాకేష్​ మారియా తన 36 ఏళ్ల అద్భుతమైన ఉద్యోగ ప్రయాణంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఆయన 1993 ముంబైలో జరిగిన పేలుళ్ల నుంచి అండర్​ వరల్డ్​ ముప్పు, 2008లోని 26/11 ముంబై ఉగ్రదాడుల వరకు ఎన్నో చూశారు. నిజ జీవితంలోని ఈ సూపర్​ కాప్​ ధైర్య, సాహసాల ప్రయాణాన్ని తెరపైకి తీసుకురావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను.' అని తెలిపారు. 

కాగా ఐపీఎస్​ అధికారి అయిన రాకేష్ మారియా 1981వ బ్యాచ్ నుంచి సివిల్​ సర్వీస్​ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. 1993లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్​ పోలీస్​గా (ట్రాఫిక్) ఉన్న రాకేష్​ మారియా ముంబై వరుస పేలుళ్ల కేసును ఛేదించారు. తర్వాత ముంబై పోలీస్​ క్రైమ్ బ్రాంచ్​కు డీసీపీగా, ఆ తర్వాత జాయింట్​ కమీషనర్​ ఆఫ్​ పోలీస్​ అధికారిగా మారారు. 2008లో 26/11 ముంబై దాడులను పరిశోధించే బాధ్యతను కూడా మారియాకు అప్పగించారు. 

చదవండి: ప్రముఖ సింగర్ కన్నుమూత.. కరోనా కారణంగా చికిత్స ఆలస్యం !
అల్లు అర్జున్​కు నెట్​ఫ్లిక్స్​ స్పెషల్​ విషెస్​.. దేనికంటే ?

మరిన్ని వార్తలు