ఈ గ్లామర్‌ ముంబై ఫ్లేవర్‌

11 Mar, 2023 05:02 IST|Sakshi

తెలుగు తెరపై ముంబై హీరోయిన్లు మెరవడం అనేది కొత్తేం కాదు. ఈ ముంబై గ్లామర్‌ ఫ్లేవర్‌ ఈ ఏడాది బాగానే కనిపిస్తోంది. మరి.. బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూటాలీవుడ్‌ స్క్రీ న్ పై మెరవనున్న ఆ కథానాయికలు చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం.

ప్రాజెక్ట్‌ కె పిలిచింది
బాలీవుడ్‌ టాప్‌ హీరోయి న్స్ లో ఒకరైన దీపికా పదుకో న్  ఇండస్ట్రీకి వచ్చిన పదిహేనేళ్ల తర్వాత తొలి తెలుగు సినిమాకు గ్రీ న్  సిగ్నల్‌ ఇచ్చారు. ఆమెను టాలీవుడ్‌కు పిలిచిన కథ ‘ప్రాజెక్ట్‌ కె’. ఈ సినిమాలో దీపికా పాత్రకు యాక్ష న్  సీ న్స్ కూడా ఉంటాయన్నది ఫిల్మ్‌నగర్‌ సమాచారం.

ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ఈ సై న్స్ ఫిక్ష న్  మూవీకి నాగ్‌ అశ్వి న్  దర్శకత్వం వహిస్తున్నారు. యాభై శాతానికి పైగా ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. అశ్వనీదత్‌ నిర్మిస్తున్న ఈ సినిమాను ముందు ఈ ఏడాది దసరాకు రిలీజ్‌ చేయాలని అనుకున్నారు. కానీ వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్‌ చేయనున్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించారు.

ఈ సంగతి ఇలా ఉంచితే... ఈ నెల 12న లాస్‌ ఏంజిల్స్‌లో జరగనున్న ఆస్కార్‌ అవార్డుల వేడుకలో దీపికా పదుకో న్  ఓ ప్రెజెంటర్‌గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలో పాల్గొనడానికి శుక్రవారం దీపికా ముంబై నుంచి లాస్‌ ఏంజిల్స్‌ ప్రయాణమయ్యారు.

జాన్వీ ఎంట్రీ షురూ
తెలుగు ప్రేక్షకులకు దివంగత ప్రముఖ నటి శ్రీదేవితో ప్రత్యేకమైన ఎమోషనల్‌ బాండింగ్‌ ఉంటుందనడంలో సందేహం లేదు. తెలుగు ప్రేక్షకుల నుంచి అంత గొప్ప ప్రేమను పొందారామె. మరి.. అలాంటి శ్రీదేవి కుమార్తె అయిన జాన్వీ కపూర్‌ (ఇద్దరు కమార్తెలు జాన్వీ కపూర్, చిన్న కుమార్తె ఖుషీ కపూర్‌) హీరోయి న్ గా కెరీర్‌ను ఆరంభించినప్పుడు తెలుగు ప్రేక్షకులు ఆమె రాక కోసం ఎదురు చూడకుండా ఉంటారా? ఆ ఎదురు చూపుల నిరీక్షణ ఐదేళ్లకు ఫలించింది.

2018లో వచ్చిన హిందీ చిత్రం ‘ధడక్‌’తో హీరోయి న్ గా పరిచయమైన జాన్వీ కపూర్‌ ఐదేళ్ల తర్వాత తొలి తెలుగు సినిమాకు సై న్  చేశారు. ‘జనతా గ్యారేజ్‌’ చిత్రం తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేష న్ లో రూపొందనున్న సినిమాలో జాన్వీ కపూర్‌ హీరోయి న్ గా నటించనున్నారు.

ఈ సినిమా ప్రారంభోత్సవం ఈ నెల 18న జరుగుతుందని, నెలాఖర్లో షూటింగ్‌ను ఆరంభించాలనుకుంటున్నారని సమాచారం. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న ఈ చిత్రాన్ని రిలీజ్‌  చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ ఆల్రెడీ ప్రకటించింది.

ఢిల్లీ టు హైదరాబాద్‌
ఒకే సినిమాతో ఇద్దరు ఢిల్లీ బ్యూటీలు తెలుగుకు వస్తున్నారు. టైగర్‌ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా రవితేజ టైటిల్‌ రోల్‌లో ‘టైగర్‌ నాగేశ్వరరావు’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హీరోయి న్ గా నటిస్తున్నారు నూపుర్‌ సన న్ . అలాగే మరో ఢిల్లీ బ్యూటీ గాయత్రీ భరద్వాజ్‌ కూడా ఇదే సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారు.

ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్‌ కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. తెలుగులో మహేశ్‌బాబు ‘వ న్ : నేనొక్కడినే’, నాగచైతన్య ‘దోచేయ్‌’ చిత్రాల్లో నటించిన కృతీ సన న్  తాజాగా ప్రభాస్‌ సరసన ‘ఆదిపురుష్‌’లో  హీరోయి న్ గా నటించారు. కృతీ చెల్లెలే నూపుర్‌.

ప్రపంచ సుందరికి స్వాగతం
ఐదేళ్ల క్రితం.. అంటే 2017లో మిస్‌ వరల్డ్‌గా నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించారు మానుషీ చిల్లర్‌. గతంలో మిస్‌ వరల్డ్‌గా నిలిచి, సినిమాల్లోకి వచ్చిన లారా దత్తా, ఐశ్వర్యా రాయ్, సుస్మితా సేన్, ప్రియాంకా చోప్రా తదితరుల మాదిరిగానే మానుషీ చిల్లర్‌ కూడా నటనను ఓ వృత్తిగా తీసుకున్నారు.

హిందీలో అక్షయ్‌ కుమార్‌ నటించిన ‘సామ్రాట్‌ పృథ్వీరాజ్‌’ హీరోయి న్ గా మానుషీ చిల్లర్‌కు తొలి సినిమా. ఇక ఈ బ్యూటీ రీసెంట్‌గా తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఓ సినిమాకు గ్రీ న్  సిగ్నల్‌ ఇచ్చారు.

వరుణ్‌ తేజ్‌ హీరోగా హిందీకి పరిచయం అవుతున్న ఈ సినిమాతో శక్తి ప్రతాప్‌ సింగ్‌ దర్శకుడిగా తొలిసారి మెగాఫో న్  పట్టారు. దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ ఇటీవలే మొదలైంది. ఈ చిత్రంలో ఇండియ న్  ఎయిర్‌ఫోర్స్‌ ఆఫీసర్‌గా వరుణ్‌ తేజ్, రాడార్‌ కమ్యూనికేష న్స్ ఆఫీసర్‌గా మానుషీ చిల్లర్‌ నటిస్తున్నారు. 

మోడల్‌ టు యాక్టర్‌
మోడల్‌గా కెరీర్‌ ఆరంభించి, ఆ తర్వాత హీరోయి న్ గా సెటిలైన బాలీవుడ్‌ అమ్మాయిల జాబితా చాలానే ఉంది. ఈ లిస్ట్‌లో తాజాగా సాక్షీ వైద్య చేరారు. అఖిల్‌ హీరోగా నటిస్తున్న ‘ఏజెంట్‌’ సినిమాతో సాక్షీ వైద్య హీరోయి న్ గా తెలుగుకు పరిచయం అవుతున్నారు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్నట్లుగా తెలిసింది. అఖిల్, సాక్షీలపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారట. ఈ చిత్రం ఏప్రిల్‌ 28న విడుదల కానుంది.

వీరితోపాటు మరికొంతమంది హిందీ తారలు తెలుగు తెరకు పరిచయం కానున్నారు. 
 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు