Anushka Sharma: బాడీగార్డ్‌ బైక్‌పై అనుష్క శర్మ చక్కర్లు... ఎంత ఫైన్‌ పడిందో తెలుసా?

17 May, 2023 20:25 IST|Sakshi

స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ గురించి అటు సినిమా, ఇటు క్రికెట్ ఫ్యాన్స్‌కు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'రబ్ నే బనాదే జోడీ' మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత బాలీవుడ్‌లో వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్‌గా మారిపోయింది. ప్రస్తుతం ఓవైపు హీరోయిన్‌గా నటిస్తూనే నిర్మాతగానూ పలు సినిమాలు చేస్తోంది. అలాంటి ఈమె ఇప్పుడు ఓ కాంట్రవర్సీలో చిక్కుకుంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 

వివరాల్లోకి వెళ్తే.. ముంబైలోని ఓ ప్రాంతానికి షూటింగ్ కోసం వెళ్తున్న క్రమంలో అక్కడ ట్రాఫిక్ ఎక్కువైంది. తన కారు ముందుకెళ్లే అవకాశం లేకుండా పోయింది. దీంతో అనుష్క బైక్‌ను ఆశ్రయించింది. బైక్‌పై తన బాడీగార్డ్‌తో కలిసి లొకేషన్‌కు చేరుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవగా ఆమె, డ్రైవర్ ఇద‍్దరూ హెల్మెట్ పెట్టుకోలేదంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు.

దీనిపై ముంబై పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. అనుష్క బాడీగార్డ్ కమ్ డ్రైవర్ సోనూ షేక్‌కు రూ.10,500 జరిమానా విధించామని, ఆ డబ్బులు మొత్తం చెల్లించేశారని ముంబై పోలీసులు పేర్కొన్నారు. ఈ మధ్యే బిగ్ బీ అమితాబ్ కూడా హెల్మెట్ లేకుండా బైక్‌పై ప్రయాణించారు. ఆయనకు రూ.1000 జరిమానా విధించగా ఆ మొత్తాన్ని చెల్లించేశారని పోలీసులు ట్వీట్‌ చేశారు.

చదవండి: 11 నెలల బాబును డబ్బు కోసం వదిలేసి వెళ్లానని తిట్టారు: యాంకర్‌ శ్యామల

మరిన్ని వార్తలు