‘మాకు ఎలాంటి లిఖితపూర్వక ఫిర్యాదు రాలేదు’

5 Aug, 2020 18:04 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ ​కేసులో రోజుకో ఆసక్తికర విషయాలు వెలుగు చుస్తున్నాయి. అయితే సుశాంత్‌ కేసును సీబీఐకి దర్యాప్తుకు ఆదేశించాలన్న బీహార్‌ ప్రభుత్వ సిఫారస్సుకు సుప్రీం కోర్టు ఇవాళ (బుధవారం) గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు కేంద్రం ప్రకటించింది. జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌ ధర్మాసనం సుశాంత్‌ మరణం వెనక ఉన్న నిజాలు బయటపడాలని సీబీఐని సూచించింది. దీంతో సుశాంత్‌ కేసు దర్యాప్తును ముంబై పోలీసులు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో సుశాంత్‌ మేనేజర్‌ దిషా సాలియన్ మృతి కేసు కూడా వెలుగులోకి వచ్చింది.

సుశాంత్‌ ఆత్మహత్యకు వారం ముందు దిషా సాలియన్‌ కూడా ఆత్మహత్య చేసకుని మృతి చెందిన విషయం తెలిసిందే. రోజుల వ్యవధిలోనే సుశాంత్‌, దిషా ఆత్మహత్యకు పాల్పడటంతో వీరిద్దరి మృతికి ఎదైన సంబంధం ఉందా అనే అనుమానాలు ​కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు దిషా ఆత్మహత్యపై ఓ పత్రిక ప్రకటనను విడుదల చేశారు. తప ఆత్మహత్యకు సంబంధించిన ఆధారాలు ఎవరికైన తెలిస్తే తమను వెంటనే సంప్రదించాలని ముంబై పోలీసులు ప్రకటనలో పిలుపునిచ్చారు.  (చదవండి: ‘రియాపై ఒత్తిడి పెంచి.. వారిద్దరిని విడదీయండి’)

అయితే సుశాంత్‌కు ప్రాణహాని ఉందని ఫిబ్రవరిలోనే ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సుశాంత్‌ తండ్రి ఇటీవల చేసిన వ్యాఖ్యాలపై డీసీపీ పరమ్‌జిత్‌ ఎస్‌ దహియా స్పందించారు. ఆయన మాకు సుశాంత్‌ భద్రతపై ఫిర్యాదు చేసిన విషయం వాస్తవమే. అయితే ‘తన కొడుకు భద్రతపై తనకు ఆందోళనగా ఉందని, మిరాండా అనే వ్యక్తిని అరెస్టు చేయాలని ఆయన మాకు వాట్సప్ ద్వారా‌ మెసేజ్‌ చేశాడు. అయితే లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వాలని ఆయనకు అప్పుడే స్పష్టంగా చేశాం. కానీ మాకు ఆయన నుంచి ఫిబ్రవరి ఎలాంటి లిఖిత పూర్వక ఫిర్యాదు రాలేదు’ అని ఆయన పేర్కొన్నారు. అంతేగాక రియా సుశాంత్‌తో ఆత్మహత్యకు ప్రేరెపించేలా ప్రవర్తించిందని, సుశాంత్ దగ్గర డబ్బులు కూడా తీసుకున్నట్లు ఆయన ఆరోపించినట్లను చెప్పారు. ప్రస్తుతం ఈ కేసులో అనుమానితురాలిగా ఉన్న రియా కనిపించడం లేదని డీజీపీ వెల్లడించారు. (చదవండి: రియా చ‌క్ర‌వ‌ర్తి ఎక్కడుందో తెలియ‌దు : డీజీపీ)

మరిన్ని వార్తలు