అక్టోబరులో 800 

15 Sep, 2023 02:20 IST|Sakshi

శ్రీలంకన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘800’. మురళీధరన్‌ పాత్రలో ‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌’ ఫేమ్‌ మధుర్‌ మిట్టల్‌ నటించగా, ఆయన భార్య మదిమలర్‌ పాత్రలో మహిమా నంబియార్‌ కనిపిస్తారు. ఎంఎస్‌ శ్రీపతి దర్శకత్వంలో వివేక్‌ రంగాచారి ఈ బయోపిక్‌ను నిర్మించారు.

ఈ సినిమా దేశవ్యాప్త థియేట్రికల్‌ రిలీజ్‌ హక్కులను నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌ సొంతం చేసుకున్నారు.ఈ సినిమాను అక్టోబరు 6న విడుదల చేస్తున్నట్లుగా గురువారం చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ఈ సందర్భంగా శివలెంక కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ‘800’ సినిమాను వచ్చే నెల 6న విడుదల చేస్తున్నాం.

ముత్తయ్య మురళీధరన్‌ జీవితంలోని క్రికెట్‌ అంశాలను గురించి మాత్రమే కాదు.. ఆయన బాల్యంలో జరిగిన ఘటనలను కూడా ఈ చిత్రంలో చూపిస్తాం. కేవలం క్రికెట్‌ ప్రేమికులనే కాదు.. ప్రేక్షకులందరినీ ఆకట్టుకునే భావోద్వేగాలు ఈ సినిమాలో ఉన్నాయి’’ అన్నారు. ‘‘ఈ సినిమా పట్ల శ్రీపతి అంకితభావం, పట్టుదల చూసి ఈ సినిమాకు ఓకే చెప్పాను. ప్రజలంతా ఈ సినిమా చూస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు ముత్తయ్య మురళీధరన్‌. ఈ చిత్రానికి సంగీతం: జీబ్రాన్‌.   

మరిన్ని వార్తలు