అనసూయ చిత్రానికి అనూప్‌ సంగీతం.. టైటిల్‌ ఇదేనా?

16 Jan, 2022 11:38 IST|Sakshi

గతకొంత కాలంగా కెరీర్‌ పరంగా కాస్త వెనకబడ్డ అనూప్‌ రూబెన్స్‌..‘బంగార్రాజ’తో మళ్లీ పుంజుకున్నాడు. ఈ సినిమా విజయంలో సంగీతం ప్రధాన పాత్ర పోషించింది. పాటలతో  పాటు నేపథ్య సంగీతం కూడా క్లిక్‌ అయింది. దీంతో అనూప్‌కి మళ్లీ వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని చిత్రాలకు సంగీతం అందిస్తున్న అనూప్‌.. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌లోకి ఎంటరయ్యాడు. యాంకర్‌ అనసూయ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఓ సినిమాకు సంగీతం అందించే ఛాన్స్ అందుకున్నాడు.

పేపర్ బాయ్, విటమిన్-షి సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచుకున్న యంగ్‌ డైరెక్టర్‌ జయశంకర్.. ఈ సారి మరో ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఢిపరెంట్‌ కాన్సెప్ట్‌తో ఓ చిత్రాన్ని  తెరకెక్కిస్తున్నాడు. ఆర్వీ సినిమాస్‌ బ్యానర్‌పై  ఆర్వీ రెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘గ్రహమ్‌’అని టైటిల్‌ ఖరారు చేసినట్లు సమాచారం. తర్వలోనే టైటిల్‌ని అధికారికంగా వెల్లడించనున్నారు. తమ చిత్రానికి అనూప్‌ సంగీతం చాలా ప్లస్‌ అవుతుందని దర్శకుడు జయశంకర్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు