సంగీత దర్శకుడు కోటి కొడుకు హీరో.. వాణి విశ్వనాథ్‌ కూతురు హీరోయిన్‌

22 Sep, 2021 21:20 IST|Sakshi

ప్రముఖ సంగీత దర్శకుడు కోటి కుమారుడు రాజీవ్ సాలూర్, సీనియర్‌ నటి వాణి విశ్వనాథ్‌ కుమార్తె వర్ష విశ్వనాథ్ జంటగా, కిట్టు నల్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ప్రొడక్షన్ నెంబర్ 1' చిత్రం షూటింగ్ సెకండ్ షెడ్యూల్ ఇటీవలే వైజాగ్‌లో ప్రారంభం అయ్యింది. టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వస్తిక ఫిలిమ్స్ పతాకాలపై గాజుల వీరేష్ (బళ్లారి) ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీత దర్శకుడిగా పనిచేస్తున​ ఈ సినిమాకి ఈశ్వర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ఈ సినిమాలో మ్యూజిక్‌ డెరెక్టర్‌ కోటి ఓ ముఖ్య పాత్ర లో నటిస్తుండగా.. సదన్, లావణ్య, రాజా రవీంద్ర, రాజా శ్రీ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత వీరేష్ మాట్లాడుతూ.. ‘దర్శకుడు మా అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా చిత్రాన్ని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. హీరో, హీరోయిన్స్‌ రాజీవ్, వర్ష  మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ వర్కౌట్‌ అయిందని’ తెలిపాడు. దర్శకుడు  కిట్టు మాట్లాడుతూ.. ‘సినిమాని అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఎంతో ఎంటర్టైనింగ్‌గా తెరకెక్కిస్తున్నాం. ప్రేక్షకులకు నచ్చే ప్రతి అంశం ఈ చిత్రంలో ఉంటుంది. నన్ను నమ్మి దర్శకుడిగా ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్మాత గాజుల వీరేష్ గారికి ధన్యవాదాలు. చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని’ అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు