సంగీత దర్శకుడికి బీజేపీ కీలక బాధ్యతలు

21 Jul, 2021 14:55 IST|Sakshi

సాక్షి, చెన్నై: యువ సంగీత దర్శకుడు కుమార్‌ నారాయణన్‌కి రాష్ట్ర బీజేపీ పార్టీ కీలక బాధ్యతలను అందించింది. ఎదుర్‌మలై చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయమైన ఈయన తమిళ సినీ రంగంలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారు. కాగా లాక్‌డౌన్‌ కాలంలో ఈయన పలు ప్రైవేటు ఆల్బమ్‌లను రూపొందిస్తూ విశేష ఆదరణను పొందుతూ వస్తున్నారు.

అలా ఈయన తాజాగా రూపొందించిన కమ్‌కమ్‌ మురుగా అనే పేరుతో భక్తి గీతంతో కూడిన ఆల్బమ్‌ సంగీత ప్రియులను అమితంగా ఆకట్టుకుంది. అంతేకాకుండా ఈ ఆల్బమ్‌ బీజేపీలో ఈయనకు కీలక బాధ్యతలను కట్టబెట్టడానికి కారణంగా నిలిచింది. కుమార్‌ నారాయణన్‌ ఇటీవల రాష్ట్ర బీజేపీ పార్టీలో చేరారు. ఈయన సేవలను గుర్తించిన రాష్ట్ర బీజేపీ పార్టీ మధ్య చెన్నై తూర్పు విభాగం ఆర్ట్‌ అండ్‌ కల్చర్‌ సంస్థకు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలను అందించింది. దీనిపై స్పందించిన యువ సంగీత దర్శకుడు కుమార్‌ నారాయణన్‌ ఈ బాధ్యత తనను బీజేపీ పార్టీని మరింత ప్రేమించేలా, ప్రేరేపిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు