కరోనాతో సంగీత దర్శకుడు కన్నుమూత

23 Apr, 2021 10:37 IST|Sakshi

సంగీత దర్శకుడు శ్రవణ్‌ కన్నుమూత

సాక్షి, ముంబై: బాలీవుడ్‌ సంగీత దర్శక ద్వయం నదీమ్‌– శ్రవణ్‌లలో ఒకరైన శ్రవణ్‌ రాథోడ్‌ (66) కరోనాకు బలయ్యారు. కోవిడ్‌ పాజిటివ్‌ రావడంతో పరిస్థితి విషమించిన స్థితిలో ఆయనను ఇక్కడి ఎస్‌ఎల్‌ రహేజా ఆసుపత్రిలో చేర్చారు. గురువారం రాత్రి 10.15 గంటలకు శ్రవణ్‌ తుదిశ్వాస విడిచారని ఆయన కుమారుడు సంజీవ్‌ రాథోడ్‌ వెల్లడించారు.

1990లో నదీమ్‌– శ్రవణ్‌లు పలు బాలీవుడ్‌ హిట్‌ సినిమాలకు సంగీతం అందించారు. 1990లో వచ్చిన ఆషికీ, ఆ మరుసటి ఏడాదే వచ్చిన సాజన్‌తో పాటు పర్‌దేశ్, రాజా హిందుస్థానీలకు బాణీలు కూర్చారు. అద్నన్‌ సమీ, సలీమ్‌ మర్చంట్, ప్రీతమ్‌ తదితరులు శ్రవణ్‌ మృతికి సంతాపం ప్రకటించారు.

శ్రవణ్‌ మృతి పట్ల బాలీవుడ్‌ స్టార్స్‌ సంతాపం ప్రకటించారు. శ్రవణ్‌ ఇక లేడన్న వార్త నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. నదీమ్‌-శ్రవణ్‌ ద్వయం సంగీతంలో ఎన్నో మ్యాజిక్స్‌ క్రియేట్‌ చేశారు. వాళ్లు పని చేసిన ధడ్‌కన్‌ నా జీవితంలోనే ప్రత్యేకమైనదిగా గుర్తుండిపోతుంది అని అక్షయ్‌ కుమార్‌ ట్వీట్‌ చేశాడు. ఈ సంగీత ప్రపంచానికి, మీ అభిమానులందరికీ ఇది పెద్ద తీరని లోటు అని ఏఆర్‌ రెహమాన్‌ తెలిపాడు.

మీరు ఇక లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను. గత నెలలో మిర్చి మ్యూజిక్‌ అవార్డ్‌ ఫంక్షన్‌లో మీ వెనకాలే కూర్చున్నాను. నాకు మాటలు రావడం లేదు. కుటుంబానికి ఇదే నా ప్రగాఢ సానుభూతి అని అర్మన్‌ మాలిక్‌ ట్వీట్ చేశాడు. శ్రవణ్‌ మరణించాడన్న వార్త విని షాకయ్యాను. సంగీత ప్రపంచంలో ఓ ఉన్నతమైన వ్యక్తిని కోల్పోయాం అని శ్రేయా ఘోషల్‌ తెలిపింది.

చదవండి: సినిమాటోగ్రాఫర్‌ మృతికి మాధవన్‌ సంతాపం

నా కుమారులు నన్ను మళ్లీ పెళ్లి చేసుకోమంటున్నారు: నటి

>
మరిన్ని వార్తలు