Trolls On Thaman: 'ఏందయ్యా తమన్ ఇది.. కాస్త చూసుకోవాలి కదా కాపీ కొట్టేటప్పుడు'

23 Aug, 2022 11:39 IST|Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా మోహన్‌ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గాడ్‌ఫాదర్. నిన్న(సోమవారం)చిరంజీవి బర్త్‌డే  సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుండగా మ్యూజిక్‌పై ట్రోలింగ్‌ నడుస్తుంది. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమా బీజీఎమ్‌ అచ్చం వరుణ్‌ తేజ్‌ గని టైటిల్‌ సాంగ్‌లా ఉందని నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు.

తీరు మార్చుకోకుండా మక్కీకి మక్కీ దించేశాడంటూ తమన్‌ను తెగ ట్రోల్‌ చేస్తున్నారు. మెగాస్టార్‌ సినిమాకు కూడా ఇలా కాపీ కొడతావా అంటూ నెటిజన్లు తమన్‌పై మండిపుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలను నెట్టింట వైరల్‌ చేస్తూ తమన్‌ తీరును ఎండగడుతున్నారు.  కాగా గని సినిమాకు కూడా మ్యూజిక్‌ ఇచ్చింది తమనే కావడం విశేషం. 

మరిన్ని వార్తలు