నమ్మాను... ఆఫర్లు వచ్చాయి

23 Jul, 2023 04:24 IST|Sakshi

ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవీ చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన పాత్రల్లో సాయి రాజేష్‌ దర్శకత్వంలో ఎస్‌కేఎన్‌ నిర్మించిన చిత్రం ‘బేబీ’. ఈ సినిమా రూ. 50 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను సాధించిందని చిత్ర యూనిట్‌ పేర్కొంది.

ఈ సందర్భంగా ఈ చిత్రం మ్యూజిక్‌ డైరెక్టర్‌ విజయ్‌ బుల్గానిన్‌ మాట్లాడుతూ– ‘‘బింబిసార’ దర్శకుడు వశిష్ఠ ద్వారా సాయిరాజేష్‌ పరిచయం అయ్యారు. అలా ‘బేబీ’కి సంగీతం ఇచ్చాను. ‘బేబీ’ విజయం సాధిస్తుందని నేను బలంగా నమ్మాను. అందుకే రెండున్నరేళ్లుగా ఏ ్రపాజెక్ట్‌ ఒప్పుకోలేదు. ఈ సినిమా పాటలు రిలీజ్‌ కాగానే చాలా ఆఫర్స్‌ వచ్చాయి’’ అన్నారు.

మరిన్ని వార్తలు