సహాయం కోసం నాన్నకు ఫోన్‌ చేశా!

30 Jul, 2020 03:08 IST|Sakshi

ఒక్కో పాత్రలోకి వెళ్లడానికి ఒక్కో విధంగా వర్క్‌ చేస్తుంటారు నటీనటులు. రీసెర్చ్‌ చేయడం, సంబంధిత మనుషులతో మాట్లాడటం, డైలీ రొటీన్‌ మార్చడం వంటి ఎంతో కృషి ఒక పాత్ర వెనక ఉంటుంది. ‘‘సుకన్య పాత్ర కోసం చాలా రీసెర్చ్‌ చేశాను అంటున్నారు’’ శ్రుతీహాసన్‌. ఆమె నటించిన హిందీ చిత్రం ‘యారా’  ఓటీటీలో విడుదల కానుంది. విద్యుత్‌ జమాల్‌ హీరో. ఈ చిత్ర కథాంశం 1970లోజరుగుతుంది. ‘‘అప్పటి పాత్రలోకి వెళ్లడానికి మా నాన్న(కమల్‌ హాసన్‌) ఇచ్చిన సూచనలు ఉపయోగపడ్డాయి’’  అన్నారు శ్రుతి.

దాని గురించి మాట్లాడుతూ – ‘‘ఏ పాత్రని అయినా నా స్టయిల్‌ లో చేయాలనుకుంటాను. నా పాత్రల గురించి నాన్నతో పెద్దగా చర్చించను. కానీ ‘యారా’లో సుకన్య పాత్ర ఎలా చేయాలో అర్థం కాలేదు. అందుకే సహాయం కోసం నాన్నకు ఫోన్‌ చేశాను. ‘మనకు పెద్దగా పరిచయం లేని పాత్రలు చేస్తున్నప్పుడు ఆ పాత్రను ముందు అర్థం చేసుకోవాలి. కట్టూబొట్టూ విషయంలో చాలా కేర్‌ తీసుకోవాలి. ఆ పాత్ర గురించి తెలిసినవాళ్లు ఇలా ఉంది ఏంటి అనుకోకుండా చేయాలి అంటూ నాన్న చాలా సూచనలు ఇచ్చారు. అవి చాలా ఉపయోగపడ్డాయి. ఇలాంటి పాత్రలు పోషించినప్పుడు  ‘బాగానే చేసింది’ అనేది కూడా పెద్ద ప్రశంసలాగా ఉంటుంది’’ అని శ్రుతీహాసన్‌ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు