My Dear Bootham Trailer: నవ్వులు పూయిస్తోన్న భూతం.. ప్రభుదేవా గెటప్‌ అదుర్స్‌

10 Jul, 2022 12:38 IST|Sakshi

కొరియోగ్రాఫర్‌గా, దర్శకుడిగా, నటుడిగా చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభుదేవా. ఒకవైపు  చిరంజీవి లాంటి స్టార్‌ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా చేస్తూనే మరోవైపు వరుస సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నుంచి వచ్చిన ప్రయోగాత్మక చిత్రం ‘మై డియర్‌ భూతం’. తమిళంలో పలు హిట్ సినిమాలు రూపొందించి సక్సెస్‌ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఎన్. రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏఎన్ బాలాజీ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. వైవిద్యభరితమైన కథతో అవుట్ అండ్ అవుట్ కిడ్స్ ఫాంటసీగా తెరకెక్కిన ఈ మూవీ జులై 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్‌.

(చదవండి: అల్లు అర్జున్‌ స్టార్ట్‌ చేస్తే.. రామ్‌ పూర్తి చేశాడు! )

పిల్లవాడితో మంచి అనుబంధం పెంచుకున్న భూతలోక చక్రవర్తి కర్ణముఖిగా ప్రభుదేవా పరిచయంతో ట్రైలర్‌ ప్రారంభమవుతుంది. భూతమైన జీని పిల్లవాడికి సహాయం చేయడానికి కిందకు వస్తాడు. ఆ తర్వాత వీరిద్దరు కలిసే చేసే పనులు నవ్వులు పూయిస్తున్నాయి. డి ఇమ్మాన్‌ అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కామెడీ స్థాయిని పెంచేసింది. పిల్లాడి తల్లిగా రమ్యా నంబీశన్ నటించారు. జీనీకి కిడ్స్‌కి మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ‘ఈ మూవీ కోసం టీం అంతా చాలా కష్టపడింది. మంచి సినిమా చేశాం. మీ అందరి ఆశీర్వాదం కావాలి. మీ అందరికీ చిత్రం నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని  ప్రభుదేవా అన్నారు.

మరిన్ని వార్తలు