అల్లరి నరేశ్‌ ‘ఉగ్రం’ హీరోయిన్‌ను పరిచయం చేసిన మూవీ టీం

4 Sep, 2022 00:59 IST|Sakshi
మిర్నా మీనన్‌

హిట్‌ ఫిల్మ్‌ ‘నాంది’ తర్వాత హీరో ‘అల్లరి’ నరేశ్, దర్శకుడు విజయ్‌ కనకమేడల కాంబినేషన్‌లో రూపొందనున్న సినిమా ‘ఉగ్రం’. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్‌ త్వరలో ఆరంభం కానుంది.

ఇందులో మిర్నా మీనన్‌ కథానాయికగా నటించనున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. తూము వెంకట్‌ కథను అందిస్తున్న ఈ సినిమాకు అబ్బూరి రవి మాటలు రాస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, కెమెరా: సిద్‌.

మరిన్ని వార్తలు