ఉప్పెన విజయం: వైష్ణవ్‌, ‘బేబమ్మ’కు భారీ గిఫ్ట్‌

27 Feb, 2021 08:15 IST|Sakshi

త్వరలోనే దర్శకుడుకి కూడా ఖరీదైన బహుమతి

డెబ్యూ మూవీతోనే భారీ హిట్‌ని తమ ఖాతాలో వేసుకున్నారు ‘ఉప్పెన’ హీరో, హీరోయిన్‌, దర్శకుడు. వైష్ణవ్‌ తేజ్‌, ‘బేబమ్మ’ కృతీ శెట్టి, దర్శకుడు బుచ్చిబాబుకి ఇండస్ట్రీలో ఉప్పెననే తొలి చిత్రం. భారీ అంచానాల మధ్య విడుదలైన ఈ చిత్రం అదే రేంజ్‌లో కలెక్షన్స్‌ సాధించింది. ఇప్పటి వరకు దాదాపు 100 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఉప్పెన నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ హీరో, హీరోయిన్లకు ఊహించని.. భారీ సర్‌ప్రైజ్‌ ఇచ్చారట. సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో వీరిద్దరికి భారీ ఎమౌంట్‌ గిఫ్ట్‌గా ఇచ్చారనే టాక్‌ వినిపిస్తోంది.

ఈ క్రమంలో హీరో వైష్ణవ్‌ తేజ్‌కి కోటి రూపాయలు.. హీరోయిన్‌ కృతీ శెట్టికి 25 లక్షల రూపాయలు ఇచ్చారని తెలుస్తోంది. ఈ మేరకు చిత్ర నిర్మాతలు ఇప్పటికే చెక్స్‌ని హీరో, హీరోయిన్లకు ఇచ్చినట్లు సమాచారం. ఇక త్వరలోనే ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుకు కూడా ఖరీదైన బహుమతి ఇవ్వనున్నారట. గతంలో బుచ్చి బాబుకు కారు లేదా ఇల్లుని ఆఫర్‌ చేసిన సంగతి తెలిసిందే.

ఇక ‘ఉప్పెన’ చిత్రానికి గాను వైష‍్ణవ్‌ తేజ్‌ 50 లక్షల రూపాయల పారీతోషికం తీసుకోగా.. గిఫ్ట్‌గా అంతకు రెట్టింపు అందుకోవడం విశేషం. ఏది ఏమైనా ఉప్పెన విజయం ఈ మెగా హీరోకు ఇండస్ట్రీలో బలమైన పునాది వేసిందనే చెప్పాలి. ఇక ఈ చిత్రం నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ చేతిలో ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. వీటిలో అల్లు అర్జున్‌ పుష్ప, మహేష్‌ బాబు సర్కార్‌ వారి పాట వంటి భారీ బడ్జెట్‌ చిత్రాలు కూడా ఉన్నాయి. 

చదవండి: 
బాలీవుడ్‌లో రీమేక్‌ కానున్న ‘ఉప్పెన’
వైష్ణవ్‌ తేజ్‌ తొలి పారితోషికం ఎంతంటే?

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు