రాజమౌళి-ప్రభాస్‌తో పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌కు మేకర్స్‌ ప్లాన్‌!

16 Sep, 2021 13:07 IST|Sakshi

‘బాహుబలి’తో చిత్రంతో ఒక్కసారిగా పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగాడు ‘డార్లింగ్‌’ ప్రభాస్‌. ఆయనకు అంత్యంత భారీ విజయాన్ని అందించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టిన ఈ మూవీని దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి తెరకెక్కించాడు. బాహుబలి తర్వాత ప్రభాస వరుస పాన్‌ ఇండియా ప్రాజెక్ట్స్‌తో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండగా  ప్రభాస్‌- రాజమౌళి కాంబినేషన్‌లో మరో భారీ ప్రాజెక్ట్స్‌కు మైత్రీ మూవీ మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రభాస్‌ ప్రస్తుతం ‘సలార్‌, రాధేశ్యామ్‌, ఆది పురుష్‌ చిత్రాలతో పాటు నాగ్‌ అశ్విన్‌తో సైన్స్‌ ఫ్రికక్షన్‌ మూవీకి సంతకం చేసిన సంగతి తెలిసిందే.

చదవండి: అమెరికాలో సేదతీరుతున్న జగపతి బాబు

ఈ ప్రాజెక్ట్స్‌ అనంతరం ప్రభాస్‌ కోసం స్క్రిప్ట్‌ సిద్దం చేయాల్సిందిగా మైత్రి మేకర్స్‌ రాజమౌళిని సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దీనిపై రాజమౌళితో చర్చలు జరపుతున్నట్లు వినికిడి. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదు. మరీ ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే మేకర్స్‌ స్పందించే వరకు వేచి చూడాల్సిందే. కాగా ఇప్పటికే ప్రభాస్‌ రాధేశ్యామ్‌ షూటింగ్‌ పూర్తి కాగా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటోంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ‘సలార్‌’ చిత్రం షూటింగ్‌ కూడా చివరి దశకు చేరుకుంది. ఇటీవల బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓం రౌత్‌ దర్శకత్వంలో రూపొందే ఆది పురుష్‌ మూవీ ఇటీవల సెట్‌పైకి వెళ్లిన సంగతి తెలిసిందే. 

చదవండి: ముంబై ఎయిర్‌పోర్టులో కరీనాకు చేదు అనుభవం

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు