మలయాళ ఇండస్ట్రీకి మైత్రీ మూవీ మేకర్స్‌

13 Jul, 2023 04:09 IST|Sakshi

తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్‌ హీరోలతో పలు బ్లాక్‌ బస్టర్‌లను అందించిన మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ మలయాళంలో అడుగుపెట్టింది. తొలి ప్రాజెక్ట్‌గా ‘గాడ్‌ స్పీడ్‌’ అనే బ్యానర్‌తో కలిసి ‘నడికర్‌ తిలగం’ సినిమాకి శ్రీకారం చుట్టారు. టొవినో థామస్‌ హీరోగా లాల్‌ జూనియర్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

నవీన్‌ యర్నేని, వై. రవిశంకర్, అల్లన్‌ ఆంటోని, అనూప్‌ వేణుగోపాల్‌ నిర్మిస్తున్న ఈ సినిమా బుధవారం కొచ్చిలోప్రారంభమైంది. ‘‘టొవినో థామస్‌ ఈ చిత్రంలో అనేక సవాళ్లతో కూడిన సూపర్‌ స్టార్‌ డేవిడ్‌ పడిక్కల్‌ పాత్రను పోషిస్తున్నారు. బుధవారమే రెగ్యులర్‌ షూటింగ్‌ప్రారంభించాం’’ అన్నారు. భావన కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆల్బీ, సంగీతం: యక్జాన్‌ గారి పెరీరా, నేహా నాయర్‌.

మరిన్ని వార్తలు