బ్లాక్‌బస్టర్‌ డైరెక్టర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు: మైత్రీ మూవీస్‌

15 Feb, 2021 14:55 IST|Sakshi

మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన చిత్రం ‘ఉప్పెన’. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న విడుదలై బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజే ఈ మూవీ రికార్డు స్టాయిలో ప్ర‌పంచ వ్యాప్తంగా 10.42 కోట్ల రూపాయ‌ల షేర్ రాబట్టింది. అదే రికార్డు స్థాయిలో వీకెండ్‌కు కూడా కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ నేపథ్యంలో ఇవాళ దర్శకుడు బుచ్చిబాబు సన పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు మైత్రీ మూవీస్‌ ట్విటర్‌ వేదికగా భాకాంక్షలు తెలుపుతూ ‘ఉప్పెన’ వీకెండ్‌ కలెక్షన్‌లను వెల్లడించింది.

‘మా బ్లాక్‌బస్టర్‌‌ డైరెక్టర్‌ బుచ్చిబాబు సనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు, అలాగే ‘ఉప్పెన’ 50 కోట్ల కలెక్షన్‌లు రాబట్టిన సందర్భంగా ఆయనకు అభినందనలు’ అంటూ మైత్రీ మూవీస్‌ ట్వీట్‌ చేసింది. కాగా క్రియోటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ సొంతం చేసుకుని సక్సెస్ టాక్‌తో ముందుకెళుతుంది. ఈ సినిమాలో వైష్ణవ్‌కు జోడీగా కృతి శెట్టి నటించగా.. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్‌ పాత్రలో నటించాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు. 

చదవండి: గుడ్‌న్యూస్‌: ఓటీటీలోకి ఉప్పెన.. ఎప్పుడంటే          
              ‘ఉప్పెన’ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. ఆల్‌టైమ్‌ రికార్డు

మరిన్ని వార్తలు