అక్టోబర్ 14న వస్తున్న 'నా వెంట‌ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా'

8 Oct, 2022 18:58 IST|Sakshi

తేజ్ కూర‌పాటి, అఖిల జంట‌గా తెరకెక్కుతున్న చిత్రం 'నా వెంట‌ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా'. వెంక‌ట్ వందెల ద‌ర్శ‌క‌త్వంలో ముల్లేటి నాగేశ్వ‌రావు, ముల్లేటి క‌మ‌లాక్షి, గుబ్బ‌ల వేంక‌టేశ్వ‌రావులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీని ఈనెల 14న థియేటర్లలో ప్రేక్షకులను అలరించనుందని చిత్రబృందం ప్రకటించింది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి తెలుగు నిర్మాతల మండలి  కార్యదర్శి మెహన్ వడ్లపట్ల, యం.ఆర్.సి. వడ్ల పట్ల , నిర్మాతలు సి.హెచ్‌వీ.యస్.యన్ బాబ్జీ, కాసుల రామకృష్ణ, రవీంద్ర గోపాల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 

తెలుగు నిర్మాతల మండలి కార్యదర్శి మెహన్ వడ్లపట్ల మాట్లాడుతూ.. 'ఇంతకుముందు ముల్లేటి నాగేశ్వ‌రావు చాలా మంచి సినిమాలు తీశారు. 15 ఏళ్ల గ్యాప్ తరువాత నిర్మించిన ఈ సినిమా పాటలు, టీజర్, ట్రైలర్ చాలా బాగున్నాయి. ఈ నెల 14న వస్తున్న ఈ సినిమా  గొప్ప విజయం సాదించాలి' అని అన్నారు. యం.ఆర్.సి. వడ్లపట్ల చౌదరి మాట్లాడుతూ.. 'ముల్లేటి వారు సినిమాను ఒక తపస్సులా భావించి చాలా కష్టపడి  తీశారు. మంచి కథను  సెలెక్ట్ చేసుకొని తీశారు.ఈ సినిమా తరువాత  ముల్లేటి ఫ్యామిలీతో మరో సినిమా తీస్తున్నాం. ఈ నెల 14 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి' అని అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌ ముల్లేటి నాగేశ్వ‌రావు మాట్లాడుతూ.. 'మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. మంచి కాన్సెప్ట్ తో ప‌ల్లెటూరి నేప‌ధ్యంలో సాగే చ‌క్క‌టి ప్రేమ‌క‌థలో యూత్‌కు కావాల్సిన వినొదాన్ని మిక్స్ చేసి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాం. తేజ్ కూరపాటి ఈ సినిమాలో చాలా బాగా నటించాడు. హీరోయిన్‌కు ఇది మొదటి సినిమా అయినా చాలా చక్కగా నటించింది. మంచి కథతో వస్తున్న ఈ సినిమాను ఫ్యామిలీ అందరూ వచ్చి చూసేలా ఉంటుంది.' అని అన్నారు. చిత్ర దర్శకుడు వెంక‌ట్ వందెల మాట్లాడుతూ..'మంచి కంటెంట్‌తో  రెగ్యులర్ స్టోరీకు భిన్నంగా  వస్తున్న ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుంది.ప్రతి ఒక్కరికీ రీచ్ అవ్వాలనే ఉద్దేశ్యంతో సరైన థియేటర్స్ దొరకనందున మేము సినిమాను వాయిదా వేసుకుంటూ వచ్చాం. చివరకు మాకు అనుకున్న థియేటర్స్ లభించడంతో  ఈ నెల 14న రిలీజ్ చేస్తున్నాం. అందరూ మా సినిమాను అశీర్వదించాలని కోరుతున్' అని అన్నారు.
 

మరిన్ని వార్తలు