ఐసీయూలో ప్రముఖ బుల్లితెర నటి.. ఎనిమిది రోజులుగా నరకం..!

10 Jan, 2023 18:25 IST|Sakshi

బాలీవుడ్ బుల్లితెర నటి, నాగిని-6 ఫేమ్ మహేక్ చాహల్ ఆస్పత్రిలో చేరారు. అనారోగ్య సమస్యలతో ముంబైలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. నాలుగు రోజులుగా వెంటిలేటర్‌పైనే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె న్యూమోనియాతో బాధపడుతున్నట్లు సమాచారం. 

 శ్వాస తీసుకోలేకపోయా: నటి ఆవేదన

మహేక్ చాహల్ మాట్లాడుతూ.. 'నాకు న్యుమోనియా వచ్చింది. అది ఛాతీలో ఎక్కువగా ఇబ్బంది పెడుతోంది. దీంతో ఒక్కసారి కూడా శ్వాస తీసుకోలేకపోయా. జనవరి 2 నుంచి ఆసుపత్రిలో ఉన్నా. ప్రస్తుతం బాగానే ఉన్నా ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ సమస్య ఎక్కువగా ఉంది. నేను దగ్గిన ప్రతిసారీ చాలా బాధగా ఉంది. చాలా భయానికి గురయ్యా.నేను ప్రస్తుతం విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది'. అని వెల్లడించింది. ఈ విషయం తెలుసుకున్న చాహల్ తల్లి   రెండు రోజుల తర్వాత నార్వే నుంచి వచ్చింది. 

మహేక్ చాహల్ ఒక నార్వేకు చెందిన నటి, మోడల్. ఆమె హిందీ సినిమాలు, టెలివిజన్‌లో నటిస్తోంది. ఆమె 2002లో తెలుగు చిత్రం నీతో మూవీతో  తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఆ తరువాత 2003లో నయీ పదోసన్‌తో హిందీలోకి ప్రవేశించింది. ఆమె హిందీ, తెలుగు, పంజాబీ, తమిళ చిత్రాల్లో  అనేక సాంగ్స్‌లో  కనిపించింది.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు