దూసుకెళ్తున్న‘నాంది’.. ఫస్ట్‌ డే కలెక్షన్లు ఎంతంటే..

20 Feb, 2021 14:41 IST|Sakshi

‘వరుస అపయజయాలు.. కామెడీ ఇమేజ్‌‌ని పక్కనపెట్టి సీరియస్‌ సినిమా చేస్తున్నాడు. ఇలాంటి మూవీస్‌ ఈ హీరోకి సెట్‌ అవుతుందా లేదా? నరేశ్‌ ఈ ఏడాదైనా హిట్‌ కొడుతాడా లేదా?​‍’ ఇలా ఎన్నో అనుమానాల నడుమ శుక్రవారం విడుదలైన అల్లరి నరేశ్‌ ‘నాంది’ సినిమాకి అద్భుత స్పందన వచ్చింది. మార్నింగ్‌ షో నుంచి సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. నరేశ్‌ నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ ‘అల్లరోడి’లో మంచి నటుడు ఉన్నాడని సినిమా చూసిన ప్రేక్షకులంతా మెచ్చుకుంటున్నారు.

ఇక చాలా కాలం తర్వాత నరేశ్‌ సినిమాకు పాజిటివ్‌ టాక్‌ రావడంతో బాక్సాఫీస్‌ వద్ద ‘నాంది’ ఊహించని రీతిలో దూసుకెళ్తోంది. ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు రూ. 49 లక్షలు షేర్, రూ. 72 లక్షల గ్రాస్ రాబట్టింది. నైజాంలో రూ. 18 లక్షలు, సీడెడ్‌లో రూ. 6 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 5.5 లక్షలు, ఈస్ట్‌లో రూ. 5.1 లక్షలు, వెస్ట్‌లో రూ. 2.2 లక్షలు, గుంటూరులో 3.5 లక్షలు, కృష్ణాలో 3.2లక్షలు, నెల్లూరులో రూ.2 లక్షలు, ఓవర్సీస్‌లో రూ.2 లక్షలు రాబట్టింది. 

ఇక ఇప్పటికే ఈ మూవీ  రూ. 2.70 కోట్ల బిజినెస్‌ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను రూ. 3 కోట్లుగా నిర్ణయించుకున్నారు. మొదటి రోజు రూ. 49 లక్షలు వసూలు కావడంతో.. టార్గెట్‌ను చేరుకోవాలంటే మరో రూ. 2.51 కోట్లు కలెక్షన్లు రాబట్టాల్సి ఉంటుంది. వీకెండ్ కావడం, సినిమాకు పాజిటివ్‌ రావడంతో మరో రెండు రోజుల్లో నాంది కలెక్షన్లు భారీగా ఉండోచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

చదవండి

ఎనిమిదేళ్లు పట్టింది.. అల్లరి నరేశ్‌ కంటతడి 

‘నాంది’ మూవీ రివ్యూ

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు