నా బెండ్‌ తీశాడు

7 Nov, 2020 03:33 IST|Sakshi
సాయితేజ్, విజయ్‌ కనకమేడల, ‘అల్లరి’ నరేశ్‌

– ‘అల్లరి’ నరేశ్‌

‘‘చాలా రోజుల తర్వాత మరోసారి నన్ను ఆర్టిస్ట్‌గా గుర్తించే సినిమా ఇది. ‘గమ్యం’ తర్వాత నాకు మరో మొమరబుల్‌ మూవీ అవుతుంది. విజయ్‌ టాలెంట్‌ ఏంటో షూటింగ్‌ మొదలైన రెండు మూడు రోజుల్లోనే తెలిసిపోయింది. విజయ్‌ నా బెండు తీశాడు (నవ్వుతూ). ఆయన దర్శకత్వంలో ఇదే బ్యానర్‌లో మరో సినిమా చేయబోతున్నాను’’ అన్నారు ‘అల్లరి’ నరేశ్‌. విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో ‘అల్లరి’ నరేశ్, వరలక్ష్మీ శరత్‌కుమార్, నవమి ముఖ్య పాత్రల్లో సతీష్‌ వేగేశ్న నిర్మించిన చిత్రం ‘నాంది’.

శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సాయి తేజ్‌ ‘బ్రీత్‌ ఆఫ్‌ నాంది’ (టీజర్‌)ని విడుదల చేశారు. సాయి తేజ్‌ మాట్లాడుతూ – ‘‘నరేశ్‌ అన్న నటించిన ‘నేను’, ‘గమ్యం’, ‘మహర్షి’ సినిమాల్లో ఆయన నటన నాకు చాలా ఇష్టం. ‘నాంది’ టీజర్‌ చాలా బాగుంది. నా ‘సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌’ సినిమాకి విజయ్‌ చాలా హెల్ప్‌ చేశారు. ఆయన దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా పెద్ద సక్సెస్‌ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘కరోనా సమయంలో కూడా ఎంతో రిస్క్‌ చేసి షూటింగ్‌ కంప్లీట్‌ చేశాం’’ అన్నారు సతీష్‌ వేగేశ్న. విజయ్‌ కనకమేడల మాట్లాడుతూ – ‘‘ఇప్పటివరకూ విడుదలైన పోస్టర్స్, ఫస్ట్‌ రివీల్‌ ఇంప్యాక్ట్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ‘బ్రీత్‌ ఆఫ్‌ నాంది’కి కూడా మంచి రెస్పాన్స్‌ వస్తుందని ఆశిçస్తున్నాను’’ అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు