నా కోరిక అదే: నటి వరలక్ష్మి

25 Feb, 2021 08:58 IST|Sakshi

పటమట(విజయవాడ తూర్పు): నాంది చిత్ర యూనిట్‌ నగరంలో సందడి చేసింది. సినిమా విజయోత్సవంలో భాగంగా నగరానికి విచ్చేసిన వారు ఓ హోటల్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. హీరో నరేష్‌ మాట్లాడుతూ అల్లరి చిత్రంతో తనకు కామెడీ హీరోగా గుర్తింపు వచ్చిందని.. అయితే నరేష్‌ కామెడీనే కాదు అన్ని రకాల పాత్రలు చేస్తాడనే నమ్మకం “నాంది’తో ప్రేక్షుకులకు వచ్చిందన్నారు. నాంది చిత్రంలో కంటెంట్‌ ఉన్న కారణంగానే హిట్‌ అయ్యిందన్నారు. ఇకపై కథల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తానని తెలిపారు.

సందేశాత్మక చిత్రాలలో నటించాలని ఉందని చెప్పారు. అనంతరం నటి వరలక్ష్మి శరత్‌ కుమార్‌ మాట్లాడుతూ నాంది చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించారని, వారికి కృతజ్ఞతలు చెప్పేందుకు సక్సెస్‌ యాత్ర చేపట్టామని వివరించారు. అన్ని రకాల వైవిధ్యమైన పాత్రలు చేయాలనేది తన కోరికగా పేర్కొన్నారు. దర్శకుడు కనకమేడల విజయ్, నిర్మాత సతీష్‌ వేగేశ్న నాంది చిత్రం విజయవంతం కావడం సంతోషంగా ఉందన్నారు. సమావేశంలో హాస్య నటుడు ప్రవీణ్, ఆర్ట్‌ డైరెక్టర్‌ బ్రహ్మ, డైరెక్టర్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీ సిద్ధు తదితరులు పాల్గొన్నారు.
చదవండి:
ఇకపై ఆ తప్పు చేయకూడదనుకుంటున్నా! 
ఎన్టీఆర్‌ సినిమాలో విలన్‌గా విజయ్‌ సేతుపతి!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు