జాక్వెలిన్‌కు కాకుండా నాటునాటుకు ఆస్కార్‌.. అసూయ వెల్లగక్కిన హీరోయిన్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌

16 Mar, 2023 10:38 IST|Sakshi

ఆస్కార్‌ రావడం భారతీయులందరికీ ఎంతో గర్వకారణమైన విషయం. కానీ సౌత్‌ సినిమాలకు ఈ అవార్డులు రావడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో నాటు నాటు(ఆర్‌ఆర్‌ఆర్‌) పాటకు, బెస్ట్‌ షార్ట్‌ ఫిలిం కేటగిరీలో ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌ ఆస్కార్స్‌ గెలుచుకున్న సంగతి తెలిసిందే! ఇది జీర్ణించుకోలేకపోయిన కొందరు ఈ రెండు చిత్రాలపై అక్కసు వెల్లగక్కుతున్నారు.

బాలీవుడ్‌ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌, క్లోజ్‌ ఫ్రెండ్‌ షాన్‌ ముట్టతిన్‌ ఆస్కార్‌ విజయంపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. 'హహ్హ, ఇది భలే ఉంది. ఇండియాలో ఈజీగా అవార్డులు కొనేస్తారనుకున్నాను కానీ ఏకంగా ఆస్కార్‌ను కూడా కొనేస్తారని ఊహించలేదు. అంతా డబ్బు మహిమ, డబ్బుంటే ఏదైనా సాధ్యమవుతుంది. అది ఆస్కార్‌ అయినా!' అని ఓ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ కింద కామెంట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవగా నెటిజన్లు మండిపడుతున్నారు.

అతడు ఇలా ఆర్‌ఆర్‌ఆర్‌ను ఆడిపోసుకోవడానికి కారణం లేకపోలేదు. తన స్నేహితురాలు జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ నటించిన 'టెల్‌ ఇట్‌ లైక్‌ ఎ వుమెన్‌' సినిమాలోని అప్లాజ్‌ కూడా బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో ఆస్కార్‌కు పోటీపడింది. అయితే ఆ పాటను వెనక్కు నెట్టి నాటునాటుకు అకాడమీ అవార్డు రావడంతో అతడు అసూయ పడుతున్నాడు. అయినా మరీ అంత జెలసీ పనికిరాదని బుద్ధి చెప్తున్నారు నెటిజన్లు.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు