తమిళనాడు: ఆ సంఘానికి మోక్షం లభిస్తుందా..?

4 May, 2021 09:19 IST|Sakshi

దక్షిణ భారత నటీనటుల సంఘానికి ఇప్పుడైనా పరిష్కారం లభిస్తుందా? అన్న చర్చ కోలీవుడ్‌లో జరుగుతోంది. పలు వివాదాల మధ్య 2019 జూన్‌లో దక్షిణ భారత నటీనటుల సంఘానికి ఎన్నికలు జరిగాయి. అప్పట్లో నటుడు విశాల్‌ జట్టుకు నిర్మాత ఐసరి గణేష్‌ జట్టుకు మధ్య జరిగిన ఎన్నికల ఫలితాలు ఇప్పటి వరకు వెలువడలేదు. తాజాగా రాష్ట్రంలో డీఎంకే అధిక స్థానాలు గెలుపొందాయి.

దీంతో ఆ పార్టీ నేత స్టాలిన్‌ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించనున్నారు. తొలిసారి ఎన్నికల్లో గెలిచి శాసనసభలోకి అడుగుపెట్టనున్న నటుడు ఉదయనిధి స్టాలిన్‌కు విశాల్‌ మంచి మిత్రుడు. ఇలాంటి పరిస్థితుల్లో  చిత్ర పరిశ్రమతో ఎంతో అనుబంధం ఉన్న ముఖ్యమంత్రి స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్‌ దక్షిణ భారత నటీనటుల సంఘం సమస్యకు పరిష్కారం చూపుతారనే ఆశ చిత్ర పరిశ్రమలో చిగురిస్తోంది.
చదవండి: వాణీ విశ్వ‌నాథ్ న‌ట వార‌సురాలు టాలీవుడ్ ఎంట్రీ

మరిన్ని వార్తలు