మెగా బ్రదర్‌ బాలీవుడ్‌ ఎంట్రీ.. ఆ హీరోకు విలన్‌గా..

25 Mar, 2021 09:20 IST|Sakshi

మెగా బ్రదర్‌ నాగబాబు బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వనున్నాడు. తెలుగులో బ్లాక్‌‌బస్టర్‌ హిట్‌గా నిలిచిన ప్రభాస్‌ చిత్రం ఛత్రపతి మూవీని యంగ్‌ హీరో బెల్లకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా హిందీలో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నాగబాబు విలన్‌ పాత్ర పొషిస్తున్నట్లు ఆయన తాజా ఫొటో షూట్‌ చూస్తే తెలుస్తోంది. ఈ ఫొటోలో నాగబాబు నోటిలో సిగరేట్‌తో విలన్‌ గేటప్‌లో దర్శనమిచ్చాడు. అది చూసి అందరూ షాకై ఆరా తీయగా ఆయన బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలిసింది. హిందీలో రిమేక్‌ కానున్న ఛత్రపతి మూవీలో నాగబాబు విలన్‌గా నటిస్తున్నట్లు సినీ వర్గాల నుంచి సమచారం.

ఇందులో విలన్ పాత్రకు కోసం చిత్ర బృందం  ఆయనను సంప్రదించారని, ఈ పాత్ర చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై చిత్రయూనిట్‌ అధికారిక ప్రకటన వెలువరించనుందట. కాగా తెలుగులో పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూనే.. బుల్లితెరపై కూడా ఆలరిస్తున్నారు. ప్రముఖ కామెడీ షో జబర్థస్త్‌ కార్యక్రమం షోకు ఆయన జడ్జిగా వ్యవహరించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేగాక అంజనా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై పలు సినిమాలు నిర్మించి నిర్మాతగా మారారు. 

చదవండి: 
అందుకే ‘ఉప్పెన’ ఈవెంట్‌కి రాలేదు: నాగబాబు

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు