MAA Elections 2021 Results: ‘మా’ అసోసియేషన్‌ రాజీనామా లేఖను షేర్‌ చేసిన నాగబాబు

12 Oct, 2021 10:43 IST|Sakshi

అసోసియేషన్ భవిష్యత్‌పై ఆందోళనగా ఉంది: నాగబాబు

Nagababu Resignation: మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన మా ఎన్నికల్లో మంచు విష్ణు.. ప్రకాశ్‌ రాజ్‌పై విజయం సాధించారు.  మా ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ప్రకాశ్‌ రాజ్‌కు మద్దుతు ఇచ్చిన మెగా బ్రదర్‌ నాగబాబు ‘మా’ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం విధితమే. ‘‘ప్రాంతీయ వాదం, సంకుచిత మనస్తత్వంతో కొట్టుమిట్టాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో కొనసాగడం నాకు ఇష్టం లేక ‘మా’ అసోసియేషన్‌లో నా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను... సెలవు’’ అంటూ ట్వీట్‌ చేశారు.

చదవండి: MAA Elections 2021 Results: మా సభ్యత్వానికి నాగబాబు రాజీనామా

అలాగే 48 గంటల్లో తన రాజీనామా లేఖను ‘మా’ కార్యాలయానికి పంపిస్తానని కూడా ఆయన స్పష్టం చేశారు. అన్నట్లుగానే సోమవారం రాత్రి నాగబాబు తన రాజీనామా లేఖను సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘మా’ అసోసియేషన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తను రాజీనామాకు గల కారణాలకు కూడా ఆయన వివరణ ఇచ్చారు. ‘‘నిష్పక్షపాతం, విభిన్నత కలిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తీరును నేను ఎప్పుడు అభిమానించేవాడిని. సంస్కృతులు, ప్రాంతాలకు అతీతంగా కళాకారులను అక్కున చేర్చుకుని ‘మా’ ఒక సొంతిళ్లుగా నిలిచేది. ఇటీవలి కాలంలో ‘మా’ సభ్యుల్లో అటు కళాకారులుగా ఇటు మనుషులుగా అనూహ్య మార్పులు వచ్చాయి. ఈ అసహ్యకరమైన మార్పులు ఆశ్చర్యానికి గురిచేశాయి’’ అన్నారు. 

చదవండి: నా రాజీనా‘మా’కు లోతైన అర్థం ఉంది: ప్రకాశ్‌రాజ్‌

అలాగే ‘ఈ ఎన్నికలు నాలాంటి వారికి కనువిప్పు కలిగించాయి. బలగం, ధన ప్రభావంతో అసోసియేషన్ సభ్యులు దారుణంగా దిగజారిపోయాయి. ఇలాంటి హిపోక్రైట్స్, స్టీరియోటైప్ సభ్యుల కారణంగానే నేను అసోసియేషన్ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నాం. అయితే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే వ్యక్తి ప్రకాశ్‌ రాజ్‌. అలాంటి వ్యక్తి వెంటే నేను ఎల్లప్పుడూ నిలబడి ఉంటాను. ఎప్పటికి నా మద్దతు ప్రకాశ్‌ రాజ్‌కే. గత పరిణామాల పట్ల నేను బాధపడటం లేదు. అసోసియేషన్ భవిష్యత్‌పైనే ఆందోళన చెందుతున్నా’ అంటూ నాగబాబు తన రాజీనామా లేఖలో రాసుకొచ్చారు.

మరిన్ని వార్తలు