Naga Chaitanya Bangarraju Teaser: ‘చిన్న బంగార్రాజు వచ్చేశాడు’

23 Nov, 2021 11:43 IST|Sakshi

అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రం ‘బంగార్రాజు’. గతంలో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు సీక్వెల్‏గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో నాగార్జున తనయుడు అక్కినేని నాగచైతన్య మరో హీరోగా నటిస్తున్నాడు. బంగార్రాజులో చైకి జోడిగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తుండగా.. నాగ్‌తో రమ్య కృష్ణ మరోసారి జతకడుతోంది.  

చదవండి: బిగ్‌బాస్‌ 5: బిగ్‌బాస్‌ హోస్ట్‌గా శ్రుతి హాసన్‌!

ఇక ఇప్పటికే ఈ సినిమాలో నాగలక్ష్మిగా విడుదలై కృతిశెట్టి ఫస్ట్‌లుక్‌కు అదిరిపోయే రెస్పాన్స్‌ వచ్చింది. ఇక ఈ రోజు నాగచైతన్య పుట్టిన రోజు సందర్భంగా నిన్న చై ఫస్ట్‌లుక్‌ విడుదల కాగా, తాజాగా ‘బంగార్రాజు’ టీజర్ విడుదల చేశాడు నాగార్జున. దీనిని ‘చిన్న బంగార్రాజు’ అంటూ నాగ్‌ విడుదల చేశాడు. తాజాగా విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ టీజర్‏లో బంగార్రాజు పాత్రలో నాగచైతన్య లుక్ అదిరిపోయింది. జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మరిన్ని వార్తలు