ఈ నెలలలోనే నాగచైతన్య- సాయి పల్లవి ‘లవ్‌స్టోరీ’!

7 Jul, 2021 18:33 IST|Sakshi

 శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా రూపొందిన చిత్రం ‘లవ్‌స్టోరీ’. కె. నారాయణదాస్‌ నారంగ్, పి. రామ్మోహన్‌ రావు నిర్మించిన ఈ సినిమాను ఏప్రిల్‌ 16న విడుదల చేయాలనుకున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా పడింది. అయితే రెండు రాష్ట్రాలలో థియేటర్లు మొదలుకానున్న నేపథ్యంలో జులై నెలాఖరు నుండి సినిమాల విడుదలకు పలువురు ఆలోచనలో ఉన్నారు. అసలే మళ్ళీ థర్డ్ వేవ్ టెన్షన్ కూడా నెలకొనడంతో అసలు ఇప్పుడే సినిమాలను విడుదల చేయాలా వద్దా.. ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా అనే అనుమానాలు కూడా నెలకొనగా లవ్ స్టోరీ మేకర్స్ మాత్రం సినిమాను విడుదల చేసేందుకే ఆసక్తి ఉన్నట్లు తెలుస్తుంది.

జూలై 23న ‘లవ్‌స్టోరీ’ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని సమాచారం. తాజాగా ఈ విషయంపై నిర్మాత నారాయణ దాస్‌ నారంగ్‌ పరోక్షంగా స్పందించారు. జూలై 23న తమ సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, కానీ 24న వెంకటేశ్‌ ‘నారప్ప’ఓటీటీలో రాబోతుందని తెలియడంతో కాస్త ఆలోచనలో పడ్డామని తెలిపారు.  మరోవైపు. ఈ నెల 30వ తేదీన ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంతన్నది అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు