Samantha-Naga Chaitanya: వైరల్‌ అవుతున్న సమంత-నాగ చైతన్య ఓల్డ్‌ ఫోన్‌ కాల్‌

7 Dec, 2021 16:12 IST|Sakshi

Fans Shares Naga Chaitanya And Samantha Old Phone Call Conversation Video: ఇటీవల ఓ ఇంగ్లీస్‌ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత తొలిసారి నేరుగా విడాకులపై స్పందించింది. విడాకులను ప్రకటన అనంతరం సోషల్‌ మీడియాలో తరచూ భావోద్వేగపూరితమైన కోట్స్‌ షేర్‌ చేస్తూ ఆవేదనను పంచుకున్న సామ్‌ డైరెక్ట్‌గా తన విడాకుల అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘నేను విడాకులు తీసుకున్నప్పుడు కుంగిపోయి చనిపోతానని అనుకున్నాను. నేను చాలా బలహీనమైన వ్యక్తినని నా ఫీలింగ్‌. కానీ నేను ఎంత బలంగా ఉన్నానో తెలిసి ఇప్పుడు ఆశ్చర్యం వేస్తోంది. నేను ఇంత దృఢంగా ఉంగలనని అనుకోలేదు’ అంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసిన సంగతి తెలిసిందే.

చదవండి: 'విడాకుల తర్వాత చనిపోతా అనుకున‍్నా'.. సమంత షాకింగ్‌ కామెంట్స్‌

ప్రస్తుతం సమంత వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇక సమంత తొలిసారి విడాకులపై స్పందించడం, దానిపై ఆమె కామెంట్స్‌ విన్న ఫ్యాన్స్‌ తను ఇంతగా కుంగిపోయిందా అంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికి చై-సామ్‌ ఫ్యాన్స్‌ కానీ, అటూ అక్కినేని ఫ్యాన్స్‌ కానీ వారి విడాకుల నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వారిద్దరూ ఇప్పటికీ కలవాలని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో సమంత తాజాగా విడాకులపై చేసిన కామెంట్స్‌కు అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. దీంతో గతంలో చై-సామ్‌ ఓ షోలో మాట్లాడుకున్న ఓల్డ్‌ ఫోన్‌కాల్‌ కన్వర్జేషన్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. ఇంతకి అదేంటంటే.

2017లో యాంకర్‌ ప్రదీప్‌ హోస్ట్‌గా వచ్చిన కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా షోకు నాగచైతన్య హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్ సింగ్‌తో పాల్గొన్నాడు. ఆ సమయంలో నాగ చైతన్య ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ రిలీజ్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో హీరోయిన్‌ రకుల్‌తో కలిసి చై ఈ షోకు హజరయ్యాడు. అప్పటికే చై-సామ్‌ల వివాహం కూడా జరిగింది. ఈ క్రమంలో ప్రదీప్‌ చైకి ఓ సవాలు విసిరాడు. సమంతకు ఫోన్‌ చేసి వారి ఫస్ట్‌ మూవీ డైలాగ్‌ను రియల్‌ లైఫ్‌లో తన జెస్సీని అడగాలని కోరాడు. దీంతో చైతన్య సమంతకు ఫోన్‌ చేసి ‘ప్రపంచంలో ఇంత మంది అమ్మాయిలు ఉండగా నేడు సామ్‌నే ఎందుకు లవ్ చేశాను’ అని అడుగుతాడు.

చదవండి: ఇండస్ట్రీలో 20 ఏళ్లుగా కొనసాగుతున్నా.. అయినా కష్టంగా ఉంది: నటుడు ఆవేదన
 

అందుకు సమాధానంగా ‘నేను మరో ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి’ అని సామ్ చెబుతోంది. ‘నాకు మరో ఆప్షన్ కూడా అక్కర్లేదు’ అని చై అంటాడు. ఆ వెంటనే సామ్, చైయ్‌కి ‘ఐ లవ్ యూ’ చెబుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు నాగ చైతన్య-సమంతలు మళ్లీ కలిస్తే బాగుండు అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ‘ఏమాయ చేశావే’ సినిమా సెట్‌లో 2009లో తొలిసారిగా సమంత-నాగ చైతన్యలు కలుసుకున్నారు. 2014లో ఆటోనగర్‌ సూర్య సినిమా కోసం మళ్లీ కలిసి చేశారు. ఆ సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించింది. మూడు సంవత్సరాల పాటు డేటింగ్ చేసిన అనంతరం 2017లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. 4 ఏళ్లు కలిసి జీవించిన అనంతరం మనస్పర్థలతో విడిపోవాలని నిర్ణయం తీసుకుని ఈ ఏడాది అక్టోబర్‌ 2, 2021న విడాకుల ప్రకటన ఇచ్చి అందరికి షాకిచ్చారు. 

మరిన్ని వార్తలు